
దేశవాళీ క్రికెట్‌లో తమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ నారాయణ్ జగదీశన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బెంగళూరు వేదికగా దులీప్ ట్రోఫీ-2025 తొలి సెమీఫైనల్లో నార్త్ జోన్, సౌత్ జోన్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో సౌత్‌జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జగదేశన్ సెంచరీతో చెలరేగాడు.
ఓపెనర్‌గా బరిలోకి దిగిన జగదీశన్ తన అద్బుతమైన బ్యాటింగ్‌తో జట్టును భారీ స్కోర్ దిశగా నడిపిస్తున్నాడు. మరో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కు 103 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత దేవదత్త్ పడిక్కల్‌తో కలిసి పార్టనర్‌షిప్‌ను జగదీశన్ నమోదు చేశాడు.
ఓవరాల్‌గా 260 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 148 పరుగులు చేసి ఆజేయంగా ఉన్నాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ మూడు వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. నార్త్‌జోన్ బౌలర్లలో నిశాంత్ సింధు రెండు వికెట్లు పడగొట్టగా.. కాంబోజ్ ఒక్క వికెట్ సాధించాడు.
భారత జట్టులోకి జగదీశన్..!?
కాగా ఆక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా తరపున జగదీశన్ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. ఇంగ్లండ్ సిరీస్‌లో గాయపడ్డ భారత ప్రధాన వికెట్ కీపర్ రిషబ్ పంత్ కోలుకోవడానికి మరికొంత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో అతడు విండీస్‌తో టెస్టు సిరీస్‌కు దూరం కానున్నాడు.
అదేవిధంగా అతడికి ప్రత్నమ్నాయంగా ఉన్న మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ సైతం తాజాగా గాయపడ్డాడు. ఈ క్రమంలోనే అతడు దులీప్ ట్రోఫీకి దూరమయ్యాడు. జురెల్ గాయం తీవ్రతపై పూర్తి స్పష్టత లేదు. అతడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్నాడు.
మరోవైపు ఇషాన్ కిషన్ సైతం గాయంతో సతమతవతున్నాడు. దీంతో జగదీశన్‌కు భారత జట్టులో సెలక్టర్లు చోటు కల్పించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. కాగా ఇంగ్లండ్ పర్యటనలో ఆఖరి టెస్టుకు ముందు జగదీశన్‌ను భారత జట్టులో చేరాడు. కానీ ఆడే అవకాశం మాత్రం లభించలేదు.
చదవండి: ‘తుదిజట్టులో రింకూకు నో ఛాన్స్.. ఏడో స్థానంలో అతడే’