కొనసాగిన 'లేట్‌ నైట్ రోమియో' | Operation late night Roam-yos continue in South zone in hyderabad | Sakshi
Sakshi News home page

కొనసాగిన 'లేట్‌ నైట్ రోమియో'

May 27 2015 8:31 AM | Updated on Aug 30 2018 6:01 PM

అర్థరాత్రి రోడ్లపై తిరుగుతూ, కాలక్షేపం చేసే పోకిరీ రాయుళ్ల భరతం పట్టేందుకు నగర పోలీసులు చేపట్టిన 'ఆపరేషన్ లేట్‌నైట్ రోమియో' మంగళవారం రాత్రి కూడా సాగింది.

చాంద్రాయణగుట్ట: అర్థరాత్రి రోడ్లపై తిరుగుతూ, కాలక్షేపం చేసే పోకిరీ రాయుళ్ల భరతం పట్టేందుకు నగర పోలీసులు చేపట్టిన 'ఆపరేషన్ లేట్‌నైట్ రోమియో' మంగళవారం రాత్రి కూడా సాగింది. మొత్తం 17 పోలీస్‌స్టేషన్ల పరిధిలో అర్థరాత్రి పనీపాటా లేకుండా తిరిగే 110 మంది యువకులను సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ ఫలక్‌నుమా నబీల్ ఫంక్షన్ హాల్‌కు తరలించారు.

బుధవారం ఉదయం వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ చేయనున్నారు. తమ పిల్లలను అదుపులో పెట్టుకోవాలని, మరోసారి వారు అర్థరాత్రి రోడ్లపై కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement