Duleep Trophy Final 2022: శతకం బాదిన సర్ఫరాజ్ ఖాన్.. సౌత్‌జోన్ విజయలక్ష్యం 529

దులీప్ ట్రోఫీ ఫైనల్ 2022లో భాగంగా వెస్ట్‌జోన్.. సౌత్‌జోన్ ముందు 529 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. 3 వికెట్ల నష్టానికి 376 పరుగుల క్రితంరోజు స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన వెస్ట్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 585 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా వెస్ట్‌జోన్‌కు 528 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది.
డబుల్ సెంచరీతో మెరిసిన యశస్వి జైశ్వాల్ 265 పరుగులు చేసి ఔటవ్వగా.. శ్రేయాస్ అయ్యర్ 71 పరుగులు స్కోరు వద్ద వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ శతకంతో చెలరేగాడు. సౌత్‌జోన్ బౌలర్లను ఉతికారేసిన సర్ఫరాజ్ 178 బంతుల్లో 127 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. సర్ఫరాజ్‌కు తోడుగా హేల్ పటేల్ కూడా అర్థ సెంచరీతో రాణించాడు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 318/7తో ఆట కొనసాగించిన సౌత్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: ఫెదరర్ మ్యాచ్‌కు ముందు నాటకీయ పరిణామం.. పిచ్చి పరాకాష్టకు
మరిన్ని వార్తలు