సెమీస్‌లో సౌత్‌జోన్, ఈస్ట్ జోన్ | south zone, east zone in semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సౌత్‌జోన్, ఈస్ట్ జోన్

Nov 24 2016 11:00 AM | Updated on Sep 4 2017 9:01 PM

ఆలిండియా ఎఫ్‌సీఐ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో సౌత్ జోన్, ఈస్ట్ జోన్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నారుు.

ఎఫ్‌సీఐ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ టోర్నీ


 సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఎఫ్‌సీఐ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో సౌత్ జోన్, ఈస్ట్ జోన్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నారుు. ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన టీమ్ చాంపియన్‌షిప్ తొలి క్వార్టర్స్ ఫైనల్లో సౌత్‌జోన్ జట్టు... వెస్ట్ జోన్ జట్టుపై గెలుపొందింది. సింగిల్స్ మ్యాచ్‌లో సిద్ధార్థ్ ఠాకూర్ 21-8, 21-8తో లిఖిత్‌పై గెలుపొందాడు. డబుల్స్ మ్యాచ్‌లో సిద్ధార్థ్- సృజన్ జోడీ 21-15, 21-10తో లిఖిత్- సుశ్రుత్ జంటపై విజయం సాధించింది.

 

రెండో క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టు... నార్త్ ఈస్ట్ జట్టును ఓడించి సెమీస్‌కు చేరుకుంది. మహిళల క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో నార్త్‌జోన్ జట్టు... ఈస్ట్ జోన్‌పై గెలుపొందింది. టేబుల్ టెన్నిస్ ఈవెంట్‌లో బుధవారం జరిగిన పురుషుల టీమ్ చాంపియన్‌షిప్‌లో నార్త్‌ఈస్ట్, వెస్ట్‌జోన్ జట్లు... మహిళల విభాగంలో ఈస్ట్‌జోన్, హెడ్‌క్వార్టర్ జట్లు గెలుపొందాయి. ఈ పోటీలను ఎఫ్‌సీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఒ.పి. డాని ప్రారంభించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement