ఇంగ్లండ్‌దే మూడో టెస్టు.. పాకిస్తాన్‌ క్లీన్‌స్వీప్‌ | England Whitewash-Pakistan-Winning-By-8 Wickets-3rd Test-Birmingham | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌దే మూడో టెస్టు.. పాకిస్తాన్‌ క్లీన్‌స్వీప్‌

Sep 12 2026 6:04 PM | Updated on Sep 12 2026 6:23 PM

England Whitewash-Pakistan-Winning-By-8 Wickets-3rd Test-Birmingham

Photo Credit: Twitter

ఇంగ్లండ్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ వైట్‌వాష్‌కు గురైంది. బ‌ర్మింగ్‌హ‌మ్ వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్టులో పాకిస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. 130 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఇంగ్లండ్ 24.2 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెన‌ర్లిద్ద‌రు డ‌కౌట్ అయిన‌ప్ప‌టికీ, జోర్డాన్ కాక్స్ (59 నాటౌట్‌), కెప్టెన్ జో రూట్ (62 నాటౌట్‌) అజేయ అర్థ‌సెంచ‌రీలు సాధించి జట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించారు.

పాక్ బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ అబ్బాస్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అంత‌క‌ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 453 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. హ్యారీ బ్రూక్ (75), జేమీ స్మిత్ (69), డాన్ లారెన్స్ (65), ఎమిలో గే (60), ఓలీ రాబిన్స‌న్ (50) అర్థ‌సెంచ‌రీలు సాధించారు. అయితే ఇంగ్లండ్ బౌల‌ర్ల ధాటికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 133 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. 

జోష్ టంగ్ 4 వికెట్లు తీయ‌గా, రాబిన్స‌న్‌, జోఫ్రా ఆర్చ‌ర్‌లు చెరో 3 వికెట్లు ప‌డ‌గొట్టారు. ఫాలోఆన్ ఆడిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 449 ప‌రుగుల‌కు ఆలౌటైంది. షాన్ మ‌సూద్ (95), బాబ‌ర్ ఆజం (76), ర‌జాఉల్లాహ్ (81), అజ‌న్ అవైస్ (59) అర్థ‌సెంచ‌రీలు సాధించారు. డాన్ లారెన్స్ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు.

సంక్షిప్త స్కోర్లు
పాకిస్తాన్ 133 & 449
ఇంగ్లండ్  453 & 130/2

👉టెస్టుల్లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ వైట్‌వాష్‌కు గురవ్వ‌డం ఇది రెండోసారి. 2022-23లో పాక్ గ‌డ్డ‌పై జ‌రిగిన మూడు టెస్టుల సిరీస్‌ను కూడా ఇంగ్లండ్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇక ఇంగ్లండ్‌కు టెస్టుల్లో ప్రత్యర్థిపై ఇది 15వ క్లీన్‌స్వీప్. అదే సమయంలో పాకిస్తాన్ టెస్టుల్లో వైట్‌వాష్‌కు గురవ్వడం ఇది పదకొండోసారి.

👉ఇంగ్లండ్ గడ్డపై ఒక మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక్క సెంచరీ నమోదు కాకపోవడం ఇది రెండోసారి కాగా, గతంలో 1888 యాషెస్ సిరీస్‌లోనూ ఒక్క సెంచరీ నమోదు కాలేదు. ఇక ఓవరాల్‌గా టెస్టు క్రికెట్‌లో ఒక టెస్టు సిరీస్‌లో ఒక్క సెంచరీ కూడా నమోదు కాకపోవడం ఇది ఎనిమిదోసారి.

ఇదీ చదవండి: #80s Trend: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ సర్‌ప్రైజ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement