ధీరజ్‌ పసిడి గురి | Dhiraj Bommadevara becomes first Indian male recurve | Sakshi
Sakshi News home page

ధీరజ్‌ పసిడి గురి

Sep 14 2026 9:46 AM | Updated on Sep 14 2026 9:59 AM

Dhiraj Bommadevara becomes first Indian male recurve

సాల్టిలో (మెక్సికో): ఆర్చరీ సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మ దేవర ధీరజ్‌ స్వర్ణ పతకం సాధించాడు. ఆదివారం జరిగిన పురుషుల రికర్వ్‌ ఫైనల్లో ధీరజ్‌ 6–5తో జున్యా నకనిషి (జపాన్‌)పై గెలిచి విజేతగా అవతరించాడు. క్వార్టర్‌ ఫైనల్లో ధీరజ్‌ 7–1తో బెర్కిమ్‌ తుమెర్‌ (టరీ్క)పై, సెమీఫైనల్లో 7–1తో జీన్‌ వాలాడోంట్‌ (ఫ్రాన్స్‌)పై నెగ్గాడు. డోలా బెనర్జీ (2007లో) తర్వాత వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన రెండో భారతీయ ఆర్చర్‌గా ధీరజ్‌ గుర్తింపు పొందాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement