Photo Credit: Twitter
చైనా, జపాన్ తరహాలో భారత్‌లో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA)కు పెద్దగా ప్రాధాన్యత లేదు. కానీ కాలక్రమేణా భారత్‌లో కూడా ఎంఎంఏకు ఆదరణ పెరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. తాజాగా పంజాబ్‌కు చెందిన ఐదేళ్ల ఫతే సింగ్ గిల్, వరల్డ్ మార్షల్ ఆర్ట్ గేమ్స్ 2026లో స్కేట్స్‌పై గట్కాలో స్వర్ణం గెలిచి ఔరా అనిపించాడు.
తద్వారా ఎంఎంఏలో చాంపియన్‌గా నిలిచిన అతి పిన్న వయస్కుడిగా ఫతే సింగ్ చరిత్ర సృష్టించాడు. థాయ్‌లాండ్‌లోని పట్టాయా వేదికగా జరిగిన వరల్డ్ మార్షల్ ఆర్ట్ గేమ్స్‌లో ఫతే సింగ్ స్కేట్‌పై గట్కాలో స్వర్ణం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచాడు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన ఐదేళ్ల ఫతే సింగ్ గిల్, సిక్కుల సంప్రదాయమైన కత్తి యుద్ధకళను స్కేట్స్‌పై ప్రదర్శించిన మొదటి బాలుడిగా రికార్డులకెక్కాడు.
గతంలో అంతర్జాతీయ వేదికలపై తన ఖడ్గ విన్యాసాలను ప్రదర్శించిన ఫతే సింగ్ తాజాగా మార్షల్ ఆర్ట్స్‌లో తన ప్రావీణ్యం ప్రదర్శించి దేశానికి పతకం తేవడం గొప్ప విషయం. ఇక ఫతే సింగ్ ఖడ్గ విన్యాస కళ అతడి రెండేళ్ల వయసులోనే ప్రారంభమైంది. ఖడ్గం పట్టుకునే విధానం, అతడి చేతి కదలికలే ఇవాళ ఫతేసింగ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. కేవలం మూడున్నరేళ్ల వయసులోనే ఫతేసింగ్ యూరోప్‌లో వరల్డ్ గ్రాండ్ ప్రిక్స్ ఫిట్ కిడ్‌తో పాటు మిస్టర్ యూనివర్సల్ ఫిట్ కిడ్ టైటిళ్లను కొల్లగొట్టి ఆశ్చర్యపరిచాడు.
Fateh Singh Gill: Meet India's 5-Year-Old World Martial Arts Championhttps://t.co/Y5gRJIWKVg pic.twitter.com/bGyBDSxsnZ
— NDTV Sports (@Sports_NDTV) August 10, 2026


