అలా జరగకపోయి ఉంటే.. సాధిక్‌ నెక్ట్స్‌ టార్గెట్ ఎవరంటే? | Jagadeeshwar Reddy Father Bhaskar Reddy Sensational Comments | Sakshi
Sakshi News home page

అలా జరగకపోయి ఉంటే.. సాధిక్‌ నెక్ట్స్‌ టార్గెట్ ఎవరంటే?

Aug 27 2026 5:29 PM | Updated on Aug 27 2026 5:47 PM

Jagadeeshwar Reddy Father Bhaskar Reddy Sensational Comments

సాక్షి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా: తన వియ్యంకుడు ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై భాస్కర్‌రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు జగదీశ్వర్‌రెడ్డి హత్యతో సాధిక్ ఖాన్ పాత్రతో పాటు తన కోడలు ప్రమేయం కూడా ఉందని భాస్కర్‌రెడ్డి ఆరోపించారు.

నూకరాజు కుటుంబం ఆత్మహత్యలకు పాల్పడిన ఘటన జరగకపోయి ఉంటే సాధిక్ ఖాన్ తర్వాత టార్గెట్ తామేనన్న భాస్కర్‌రెడ్డి.. ఇప్పటివరకు ప్రభుత్వం తన మనవడికి ఎటువంటి సెక్యూరిటీ కల్పించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుణ్ని కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశామన్న భాస్కర్‌రెడ్డి.. తన కొడుకును తన నుంచి కోడలు దూరం చేసిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

తన కుమారుడికి అనారోగ్యంగా ఉన్న సమయంలో ఆయనతో పాటు రూమ్‌లో ఉంటానంటే కోడలే వద్దని వారించిందన్నారు. సాధిక్‌ ఖాన్ ఒక సైకో.. అతడి నుంచి మా కుటుంబానికి రక్షణ కావాలి. నా కొడుకుని పొట్టన పెట్టుకుని మా కుటుంబాన్ని నాశనం చేసిన సాధిక్ ఖాన్‌ను ఉరితీయాలి. మా మనవడికి న్యాయం జరగాలి’’ అని భాస్కర్‌రెడ్డి అన్నారు.

ఇదీ చదవండి: సాధిక్‌కు ఆ కెమికల్‌ ఎక్కడి నుంచి వచ్చింది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement