విజయవాడ: వైఎస్సార్‌సీపీ పోరాటంతో ప్రభుత్వం దొగొచ్చింది. పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. 153 హెక్టార్ల పరిధిని నో మైనింగ్ జోన్‌గా ప్రకటించింది. పంచదార్ల కొండను కూటమి నేతలు తవ్వేసిన విషయం తెలిసిందే.
చారిత్రక పంచదారలను కూటమి నేతలు ధ్వంసం చేశారు. కూటమి నేతల అక్రమ మైనింగ్ పై వైసీపీ పోరాటం చేసింది. వైఎస్సార్‌సీపీ నేతలు కేంద్ర ప్రభుత్వానికి సైతం ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు నో మైనింగ్ జోన్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పంచదార్లను నోమైనింగ్ జోన్‌గా చేపట్టాలని వైఎస్సార్‌సీపీ చాలా కాలంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. లేదంటే మరింత పెద్దఎత్తున పోరాటం చేపడతామని సర్కారు హెచ్చరించింది. దీంతో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గి నో మైనింగ్ జోన్‌గా ప్రకటిస్తూ జీవో జారీ చేసింది.
ఇదీ చదవండి: పాకిస్థాన్ వెంటనే చర్యలు తీసుకోవాలి: అమెరికా చట్టసభ సభ్యులు


