breaking news
nukaraju
-
నూకరాజు కేసులో భారీ ట్విస్ట్‌లు.. సాధిక్ విచారణలో సంచలన విషయాలు
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో ఏఈ నూకరాజు అల్లుడు జగదీశ్‌రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితుడు సాధిక్ ఖాన్ విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. రూ.25 కోట్ల విలువైన ఆస్తిపై కన్నేసిన సాధిక్.. జగదీశ్‌ను హత్య చేసి, ఆయన భార్య సౌజన్యను పెళ్లి చేసుకోవాలని పథకం వేసినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఇందుకు పలు ప్రణాళికలు వేసినట్టు తెలిసింది.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు ముందే జగదీశ్ రెడ్డికి కాకినాడలో సాధిక్ స్లో పాయిజన్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనారోగ్యానికి గురైన జగదీశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం చివరిసారిగా కొబ్బరి నీళ్లలో సైనైడ్ కలిపి ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులో సాంకేతిక ఆధారాల ఆధారంగా స్లో పాయిజన్ కెమికల్, సైనైడ్ సరఫరా చేసిన వ్యక్తులను పోలీసులు గుర్తించి విచారించినట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. జగదీశ్ రెడ్డితో పాటు ఏఈ నూకరాజుకు సంబంధించిన ఆస్తిని కూడా దక్కించుకోవాలని సాధిక్ కుట్ర పన్నినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే నూకరాజు కుటుంబం ఇందుకు అంగీకరించకపోవడంతో వారిని కూడా చంపేస్తానని సాధిక్ బెదిరించినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ పరిణామాలతో తీవ్ర భయాందోళనకు గురైన నూకరాజు కుటుంబం రాజమండ్రిలో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.మరోవైపు సాధిక్ ఖాన్ మూడు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. ఇవాళ అతడిని అమలాపురం కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. అంతకుముందు వైద్య పరీక్షల కోసం సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి ఆస్పత్రికి తరలించారు. నూకరాజు అల్లుడు జగదీశ్‌రెడ్డి హత్య కేసులో సాధిక్ ఖాన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా..తాజా దర్యాప్తులో భాగంగా సాధిక్‌ను గుడారిగుంటలోని ప్రో రైఫిల్ షూటింగ్ అకాడమీతో పాటు నూకరాజు, సౌజన్య నివాసాలకు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించినట్లు సమాచారం. అక్కడి నుంచి కీలక ఆధారాలను సేకరించినట్లు పోలీసులు చెబుతున్నారు.ఇదీ చదవండి: దొంగ పెన్షన్ల కోసం టీడీపీ పన్నాగం -
ఆ దుర్మార్గుడు సాదిక్ ఖాన్ ను ఉరి తీయాలి
-
అలా జరగకపోయి ఉంటే.. సాధిక్ నెక్ట్స్ టార్గెట్ ఎవరంటే?
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: తన వియ్యంకుడు ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై భాస్కర్‌రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు జగదీశ్వర్‌రెడ్డి హత్యతో సాధిక్ ఖాన్ పాత్రతో పాటు తన కోడలు ప్రమేయం కూడా ఉందని భాస్కర్‌రెడ్డి ఆరోపించారు.నూకరాజు కుటుంబం ఆత్మహత్యలకు పాల్పడిన ఘటన జరగకపోయి ఉంటే సాధిక్ ఖాన్ తర్వాత టార్గెట్ తామేనన్న భాస్కర్‌రెడ్డి.. ఇప్పటివరకు ప్రభుత్వం తన మనవడికి ఎటువంటి సెక్యూరిటీ కల్పించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుణ్ని కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశామన్న భాస్కర్‌రెడ్డి.. తన కొడుకును తన నుంచి కోడలు దూరం చేసిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు.తన కుమారుడికి అనారోగ్యంగా ఉన్న సమయంలో ఆయనతో పాటు రూమ్‌లో ఉంటానంటే కోడలే వద్దని వారించిందన్నారు. సాధిక్ ఖాన్ ఒక సైకో.. అతడి నుంచి మా కుటుంబానికి రక్షణ కావాలి. నా కొడుకుని పొట్టన పెట్టుకుని మా కుటుంబాన్ని నాశనం చేసిన సాధిక్ ఖాన్‌ను ఉరితీయాలి. మా మనవడికి న్యాయం జరగాలి’’ అని భాస్కర్‌రెడ్డి అన్నారు.ఇదీ చదవండి: సాధిక్‌కు ఆ కెమికల్ ఎక్కడి నుంచి వచ్చింది? -
సాధిక్‌కు ఆ కెమికల్ ఎక్కడి నుంచి వచ్చింది?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య భర్త జగదీశ్వరరెడ్డి హత్యలో పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. సాధిక్ ప్రొటీన్ పౌడర్‌లో కెమికల్స్ కలిపి తన తండ్రికి ఇచ్చాడంటూ జగదీశ్వరరెడ్డి కుమారుడు రియాన్ష్ కార్తికేయ చెప్పడంతో దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆ కెమికల్ కేరళ నుంచి హైదరాబాద్‌కు వచ్చిందని, అది సాధిక్‌కు చేరేలా హైదరాబాద్‌లోని ఓ బంగారు దుకాణం యజమాని సహకరించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనిని నిగ్గు తేల్చేందుకు పోలీసు బృందం హైదరాబాద్ వెళ్లింది.నూకరాజు కుటుంబం నుంచి ఆస్తులు లాక్కునేందుకు సాధిక్ ప్రయత్నించాడనే ఆరోపణలపైనా విచారణ జరుపుతున్నారు.నూకరాజు కుటుంబం, జగదీశ్వరరెడ్డి ఆస్తులకు సంబంధించి రెండేళ్లలో ఏవైనా లావాదేవీలు జరిగాయా.. అవి ఎవరి పేరు మీద బదిలీ అయ్యాయో తెలుసుకొనేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. సౌజన్య బ్యాంక్ ఖాతాలు, పాస్ పుస్తకాలను సాధిక్ లాక్కున్నాడనే అంశంపైనా విచారణ సాగుతోంది. సాధిక్ తిమ్మాపురం పంచాయతీలో నూకరాజు పేరిట ఉన్న స్థలాన్ని విక్రయించేందుకు సైతం ప్రయత్నించాడని ఓ వ్యక్తి వాంగ్మూలంలో చెప్పినట్లు సమాచారం.రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు?సాధిక్ ఖాన్‌ను కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు పొందుపరిచినట్లు తెలిసింది. సాధిక్ మొదటి నుంచీ ఆస్తి కొట్టేయాలనే ఆలోచనతో ఉండేవాడని పేర్కొన్నట్లు సమాచారం. జగదీశ్వర్‌రెడ్డి అడ్డు తొలగించుకుని, సౌజన్యను పెళ్లి చేసుకుని, ఆమె డబ్బు, బంగారం, ఆస్తి తీసుకోవాలని అతను పథకం వేసినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపినట్లు సమాచారం. జగదీశ్వర్‌రెడ్డి ఇంటికి వెళ్లిన సాధిక్ అతడితో గొడవ పడి, తీవ్రంగా గాయపరిచాడని, అడ్డు వచ్చిన సౌజన్యపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. జగదీశ్వరరెడ్డిని అనేక మార్లు కొట్టినట్లు సాక్షులు వాంగ్మూలం ఇచ్చారని తెలిసింది. జగదీశ్వరరెడ్డి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న సమయంలో సాధిక్ హైదరాబాద్‌లోనే ఉండి సౌజన్యతో ఫోనులో మాట్లాడేవాడని కాల్ డేటా ద్వారా తేలినట్లు సమాచారం.బయటకొచ్చిన మరో లేఖ..!నూకరాజు, ఆయన కుమార్తె సౌజన్య రాసిన లేఖలతో పాటు మూడో సూసైడ్ నోట్ సైతం ఉన్నట్లు సమాచారం. ఆ నోట్ నూకరాజు భార్య మీనాదిగా ప్రచారం జరుగుతోంది. పోలీసులు సూసైడ్ నోట్లను ఫోరెన్సిక్, హ్యాండ్ రైటింగ్ పరీక్షకు పంపినట్లు సమాచారం. ఈ కేసులో మరింత లోతైన విచారణ కోసం నిందితుడు షేక్ సాధిక్ ఖాన్‌ను వారం రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలంటూ సర్పవరం పోలీసులు కాకినాడ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ఏఈ నూకరాజు కుటుంబం కేసులో మరో మలుపు
సాక్షి, కాకినాడ జిల్లా: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సాధిక్ వేధింపులు కారణం కాదని సాధిక్ ఖాన్ తల్లి నూర్జహాన్ తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నూకరాజు అల్లుడు జగదీశ్వర్‌రెడ్డిని సాధిక్ చంపలేదన్నారు. ‘‘సౌజన్య రెండు సార్లు మా ఇంటికొచ్చింది. సాధిక్‌ను పెళ్ళి చేసుకుంటానని చెప్పింది. ఈ ప్రతిపాదనకు మా కుటుంబం ఒప్పుకోలేదు. జగదీశ్వరరెడ్డి మరణించాక తనను పెళ్లి చేసుకోవాలని సౌజన్య.. సాధిక్‌ను ఒత్తిడి చేసింది’’ అంటూ సాధిక్ ఖాన్ తల్లి చెప్పుకొచ్చారు.‘‘ఈ ఏడాది ఫిబ్రవరి 14న సౌజన్య ఇంటికి రమ్మని సాధిక్‌ను పిలిచింది. అక్కడ సాధిక్‌పై జగదీశ్వర్‌రెడ్డి అతని మనుషులు దాడి చేసి బంధించారు. దీంతో వంటగదిలో కత్తితో బెదిరించి సాధిక్ అక్కడ నుండి పారిపోయాడు. జగదీశ్వరరెడ్డితో పెళ్లి కాకపొతే సౌజన్యను సాధిక్ ఇచ్చి వివాహం చేసేవాడినని నూకరాజు మా ఇంటికి వచ్చి చెప్పాడు. ఈ రిలేషనల్ మంచిది కాదని సాధిక్‌ను మందలించాను. తన భర్త పట్టించుకోవడం లేదని సాధిక్తో సౌజన్య రిలేషన్ నడిపింది. సౌజన్య కొడుకు సాధిక్‌ను అబ్బు అని.. తన తండ్రిని ఇడియట్ అని పిలిచేవాడు. రోజు ఫోన్లో మా అబ్బాయి చెప్పే కథలు విని సౌజన్య కొడుకు పడుకునేవాడు.‘‘మా ఇంటికి వచ్చి తెలుగు ఖురాన్, బుర్కా కావాలని సౌజన్య అడిగింది. చనిపోయిన రోజు సాయంత్రం 5:30కి సాధిక్‌కు సౌజన్య ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. తన స్టూడెంట్స్ కేరళలో ఈవెంట్స్ వెళ్లాలని.. రావడం కుదరదని చెప్పి సాధిక్ అకాడమీకి వెళ్ళిపోయాడు. నూకరాజు, జగదీశ్వర రెడ్డి ఆస్తులు, బంగారం మా వద్ద లేదు. మా కుటుంబం బ్యాంక్ పుస్తకాలు, ఆధార్ కార్డులు పోలీసులకు ఇచ్చేశాము.’’ అని సాధిక్ ఖాన్ తల్లి నూర్జహాన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: 6 ఏళ్లకే ఈ బాలుడు ‘అభిజీత్ దీప్కే’లా అయిపోయాడు.. -
ఒక్కరోజు గడిస్తే దేశం దాటేవాడు.. ఫోన్, కార్డులు లేకుండా నాలుగు రాష్ట్రాల్లో..
సాక్షి, కాకినాడ: నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన అనంతరం పరారీలో ఉన్న సాధిక్ ఖాన్‌ను పోలీసులు ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సాధిక్ పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. తన ఆచూకీ బయటపడకుండా సెల్‌ఫోన్, డెబిట్, క్రెడిట్ కార్డులు వెంట తీసుకెళ్లకుండా.. రైలు ప్రయాణంలో ఇతరుల ఫోన్లు ఉపయోగిస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.ఆత్మహత్య తర్వాత పరారీనూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన తర్వాత సాధిక్ ఖాన్ సామర్లకోట నుంచి పరారయ్యాడు. అక్కడి నుంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి కర్ణాటకలోని వాడి రైల్వే స్టేషన్లో దిగినట్లు పోలీసులు గుర్తించారు. వాడి నుంచి తదుపరి తన ప్రయాణాన్ని కొనసాగించిన సాధిక్.. మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చేరుకున్నాడు. అక్కడ తన స్నేహితుడిని కలిసినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. అనంతరం, సోలాపూర్‌లో కొంతసేపు మకాం వేసిన అనంతరం సాధిక్ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అక్కడి నుంచి ఢిల్లీకి, ఆపై ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సాధిక్ వరుసగా ప్రాంతాలు మార్చుకుంటూ ప్రయాణించడంతో అతడి ఆచూకీ గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది.విదేశాలకు వెళ్లేందుకు స్కెచ్..మీరట్ చేరుకున్న తర్వాత కూడా సాధిక్ అక్కడే ఉండిపోవాలని భావించలేదని పోలీసులు గుర్తించారు. కేరళలోని మలబార్ తీరానికి చేరుకుని, అక్కడి నుంచి సముద్ర మార్గంలో విదేశాలకు పారిపోవాలని ప్రణాళిక వేసుకున్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఒక్కరోజు ఆలస్యమైనా దేశం దాటి వెళ్లేందుకు ప్రయత్నించేలా తన ప్రయాణాన్ని సాధిక్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేరళ తీరానికి చేరుకుని అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా విదేశాలకు వెళ్లిపోతే పోలీసుల నిఘా నుంచి తప్పించుకోవచ్చని భావించినట్లు సమాచారం.ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్యే థామన్ ఆసుపత్రితో యువతి ఆత్మహత్యఇక, పోలీసులకు తన కదలికలపై ఎలాంటి ఆధారం దొరకకుండా ఉండేందుకు సాధిక్ మరింత జాగ్రత్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. తన వెంట సెల్‌ఫోన్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులను తీసుకెళ్లలేదు. సాధారణంగా సెల్‌ఫోన్ ద్వారా వ్యక్తి ప్రయాణించే ప్రాంతాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. అలాగే, బ్యాంకు కార్డుల వినియోగం ద్వారా కూడా అతడి కదలికలను పోలీసులు గుర్తించే అవకాశం ఉంది. దీంతో ఈ రెండింటినీ తన వెంట తీసుకెళ్లకుండా సాధిక్ ప్రయాణించినట్లు తెలిసింది. అయితే, ఇదే జాగ్రత్త చివరకు అతడికి చిక్కేలా చేసిన కీలక క్లూగా మారింది. రైలు ప్రయాణ సమయంలో సాధిక్ తోటి ప్రయాణికుల నుంచి సెల్‌ఫోన్ తీసుకుని తన సోదరి, ఓ లాయర్‌తో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. తన సొంత ఫోన్ ఉపయోగించకపోయినా.. ఇతరుల ఫోన్ల నుంచి చేసిన కాల్స్ అతడి ఆచూకీని గుర్తించేందుకు పోలీసులకు కీలక ఆధారంగా మారినట్లు తెలుస్తోంది. ఆ కాల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు సాధిక్ కదలికలపై నిఘా పెట్టారు. చివరకు అతడు మీరట్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు.మీరట్ కోర్టులో హాజరు..మీరట్‌లో సాధిక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్ పొందిన పోలీసులు అతడిని కాకినాడకు తీసుకువస్తున్నారు. కాకినాడకు తీసుకువచ్చిన తర్వాత సాధిక్‌ను విచారించడంతో కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సాధిక్‌ను కాకినాడకు తీసుకువచ్చిన అనంతరం అతడి ప్రయాణ మార్గం, ఎవరెవరిని కలిశాడు, కేరళలో ఎవరిని సంప్రదించాలనుకున్నాడు, సముద్ర మార్గంలో విదేశాలకు వెళ్లేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నాడు అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించనున్నారు. -
ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య కేసు.. ఎట్టకేలకు సాధిక్ అరెస్ట్
సాక్షి, కాకినాడ: రాజమండ్రిలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధిక్ ఖాన్‌ను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, సాధిక్ ఖాన్ కోసం గత ఐదు రోజులుగా పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. మొత్తం ఎనిమిది పోలీసు బృందాలు వివిధ ప్రాంతాల్లో అతడి కోసం గాలించినట్లు తెలుస్తోంది. చివరకు ఢిల్లీలో సాధిక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.అతడిని రేపు రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు లేదా కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన జరిగిన అనంతరం సాధిక్ కాకినాడ నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన రోజే సాధిక్ ఓ లాయర్‌తో ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సాధిక్ కారణమయ్యాడనే ఆరోపణలపై రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.ఇదిలా ఉండగా నూకరాజు అల్లుడు జగదీశ్వర రెడ్డి మృతికి సాధిక్ కారణమని ఆయన భార్య సౌజన్య లేఖ రాయడం తెలిసిందే. జగదీశ్వర రెడ్డి తండ్రి భాస్కర రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరం పోలీస్ స్టేషన్లో సాధిక్‌పై హత్య కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం సాధిక్ ఖాన్‌కు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు నూకరాజు భార్య మీనా మృతదేహం కోసం గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సాధిక్‌ను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: నూకరాజు ఆత్మహత్యలో సౌజన్య లేఖ ఇదే.. -
సౌజన్య ఫోటోలు, వీడియోలతో వేధింపులు.. AE నూకరాజు కేసులో దిమ్మతిరిగే వాస్తవాలు
-
టీడీపీ నేత కల్తీ మద్యం దుకాణం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : నకిలీ మద్యంలో తమ పార్టీ నేతలను ఆదర్శంగా తీసుకున్నాడేమో..? పార్టీలోని పెద్దలే అక్రమ దందాను ప్రోత్సహిస్తుంటే తాను మాత్రం ఎందుకు చేయొద్దు అనుకున్నాడేమో..? టీడీపీ నేత కల్తీ మద్యం దుకాణం తెరిచాడు..! శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రధాన అనుచరుడు, ఆ పార్టీ నాయకుడు అయిన పైడి ముఖలింగం అలియాస్ నూకరాజు పేరిట సరుబుజ్జిలిలో ఉన్న పీఆర్ వైన్స్‌లో శుక్రవారం 10.88 లీటర్ల నీళ్లు కలిపిన మద్యం పట్టుబడింది. లీటర్ పరిమాణంలోని కల్తీ మద్యం వాటర్ బాటిళ్లు 9, నీళ్లు కలిపిన 11 క్వార్టర్ బాటిళ్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా ఈ షాప్‌లో అమ్ముతున్న మద్యంపై ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. కల్తీ సరుకు విక్రయిస్తున్నట్లుగా మందుబాబులు ఫిర్యాదులు చేస్తున్నారు. అధిక రేట్లు, చిల్లర విక్రయాలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వచ్చాయి. ఎవరైనా ప్రశ్నిస్తే... ‘‘మాకు ఎమ్మెల్యే అందండలున్నాయి. ఇది ఆయన షాప్’’ అని బెదిరించేవారని చెబుతున్నారు. దీంతో ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకురాలేదు. ఓనర్‌ను వదలి వర్కర్లపై కేసు దుకాణ యజమాని అయినా కల్తీ మద్యం వ్యవహారంలో ముఖలింగంపై కేసు పెట్టలేదు. పీఆర్ వైన్స్‌లో కల్తీ మద్యానికి బాధ్యులుగా అందులో సేల్స్మెన్లుగా పనిచేస్తున్న కుసుంపోలవలస గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, దన్నానపేటకు చెందిన సాసుపల్లి శ్రీనివాసరావులను అరెస్ట్ చేశారు. కాగా, ముఖలింగం ఎమ్మెల్యే కూనకు అత్యంత సన్నిహితుడు. ఆయన అమరావతితో పాటు ఎక్కడకు వెళ్లినా వెన్నంటే ఉంటాడు. ఈ నేపథ్యంలోనే పలుకుబడి ఉన్న షాప్ యజమానిని తప్పించి వర్కర్లను బలి చేశారంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేసును ఆమదాలవలస ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. దుకాణాన్ని సీజ్ చేసి, నాగేశ్వరరావు, శ్రీనివాసరావులను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించినట్లు ఆమదాలవలస ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వెల్లడించారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పల్లి మురళీధర్ ఆ«ధ్వర్యంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ మర్రాపు శ్రీనివాసరావు దాడుల్లో పాల్గొన్నారు. దుకాణమే అక్రమం.. పీఆర్ వైన్స్ దుకాణం నిబంధనలకు విరుద్ధంగా పాలకొండ ప్రధాన రహదారి పక్కనే, చర్చి సమీపంలో ఏర్పాటు చేయడం గమనార్హం. దీనిపై ప్రజల నుంచి ఫిర్యాదులు, పత్రికల్లో కథనాలు వచి్చనా ఎక్సైజ్ అధికారులు చూసి వెళ్లారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు ఎక్సైజ్ శాఖలో ఓ ఉన్నతాధికారి అండదండలు సమృద్ధిగా ఉండడంతోనే పీఆర్ వైన్స్ యజమాని ఇష్టారీతిన వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. సాక్షిపై దాడి ఘటనలో కీలకపాత్ర సాక్షి పత్రిక యూనిట్ కార్యాలయంపై జరిగిన దాడిలో పీఆర్ వైన్స్ యజమాని పైడి ముఖలింగం కీలక పాత్ర పోషించాడు. కార్యాలయం బయటి భాగం ధ్వంసం చేయడంలో ఇతడే ప్రధానంగా వ్యవహరించాడు. పెద్దల మెప్పు కోసం చాలా హడావుడి చేశాడు. -
జబర్దస్త్ కమెడియన్ల బ్రేకప్? గొడవలు నిజమేనన్న నూకరాజు
పటాస్ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు నూకరాజు. తర్వాత జబర్దస్త్ షోలో భాగమయ్యాడు. టీమ్‌లో ఒకరి కింద పని చేసే స్థాయినుంచి టీమ్ లీడర్‌గా ఎదిగాడు. అతడి ప్రేయసి ఆసియాతో కలిసి కామెడీ షోలో పంచులు పేలుస్తూ ఉంటాడు. చాలాకాలంగా ప్రేమలో ఉన్న నూకరాజు, ఆసియా కొంతకాలంగా కలిసి కనిపించడం లేదు. దీంతో ఈ లవ్ బర్డ్స్‌కు ఏమైంది? వీళ్లు బ్రేకప్ చెప్పుకున్నారా? అని అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆసియాకు, నాకు గొడవలు తాజాగా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తూ యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశాడు నూకరాజు. అతడు మాట్లాడుతూ.. 'ప్రేమలో గొడవలు, అలకలు, బుజ్జగింపులు సహజమే! అలా ఆసియాకు, నాకు మధ్య చిన్నచిన్న గొడవలు జరిగాయి. తను నాపై అలిగింది. వంద శాతం తప్పు నాదే! మేమిద్దరం మాట్లాడుకోలేదు. అయితే తప్పు ఎవరిదైనా ఆసియానే స్వయంగా వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటుంది. నాపై ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. ఇగో వల్ల.. మొన్న నేను దుబాయ్ వెళ్లాను. ఐదురోజుల తర్వాత తిరిగొచ్చాను. అలా మా మధ్య మాట్లాడుకునే తీరిక కూడా లేకుండా పోయింది. తను ఫస్ట్ మాట్లాడాలని ఎదురుచూశాను. నాకు కాల్ చేసి ఉండొచ్చేమో కానీ దుబాయ్‌లో ఉండటం వల్ల నా లైన్ కలిసి ఉండకపోవచ్చు. ఇగోతో ఆమెకు బర్త్‌డే విషెస్ కూడా చెప్పలేదు. అయినా తనే తర్వాత మెసేజ్ చేసింది. తనే ఫస్ట మెసేజ్ విషెస్ చెప్పనందుకు నా మీద కోపం లేదా? అంటే బాధ మాత్రమే ఉందని చెప్పింది. చిన్న చిన్న ఇగోతో ప్రేమను దూరం చేసుకోకండి. తప్పు ఎవరు చేసినా ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గితే ఆ ప్రేమ పెళ్లిదాకా వెళ్తుంది. తనను ఎంత బాధపెట్టానో అంతే హ్యాపీగా ఉంచాలని నిర్ణయించుకున్నాను. తనకు ఆలస్యంగానైనా సరే బర్త్‌డే సర్ప్రైజ్ ఇస్తాను' అని నూకరాజు చెప్పుకొచ్చాడు. తమ బంధం ముక్కలు కాలేదని క్లారిటీ ఇచ్చాడు. చదవండి: ఓటింగ్ కేంద్రంలో ఆమె కాళ్లకు నమస్కరించి సెల్ఫీ దిగిన విజయ్ సేతుపతి -
సలహా బోర్డు అనుమతిస్తే.. 3 నెలలకుపైగా నిర్బంధించొచ్చు
న్యూఢిల్లీ: ముందస్తు నిర్బంధానికి సరైన కారణం ఉందని అడ్వైజరీ బోర్డు అభిప్రాయపడిన సందర్భాల్లో.. ‘ 3 నెలలకు మించి ముందస్తు నిర్బంధంలో ఉంచరాదు’ అనే నిబంధన వర్తించబోదని సర్వోన్నత న్యాయస్థానం తేలి్చచెప్పింది. గత ఏడాది ఆగస్టులో తనను అరెస్ట్‌చేశారని, కాకినాడ జిల్లా మేజి్రస్టేట్ ఇచ్చిన ముందస్తు నిర్బంధ ఉత్తర్వు చెల్లదంటూ పెసల నూకరాజు అనే వ్యక్తి ఆంధ్రపదేశ్ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలుచేయగా దానిని హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా గురువారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పారి్ధవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఆయనకు వ్యతిరేకంగా తీర్పును వెలువరించింది. ‘ ముందుస్తు నిర్బంధం సహేతుకమని అడ్వైజరీ బోర్డు భావిస్తే మూడునెలలకు మించి కూడా సంబంధిత వ్యక్తులను నిర్బంధంలో కొనసాగించవచ్చు. నిర్బంధం మూడు నెలలకు మించకూడదనే నిబంధన ఇలాంటి సందర్భాల్లో వర్తించదు’ అని కోర్టు తీర్పు చెప్పింది. ‘కింది కోర్టు ఉత్తర్వుల్లో ఇంతకాలం నిర్బంధించండి అని పేర్కొంటే అంత కాలానికే నిర్బంధంలో ఉంచుతారు. ఒకవేళ కాలావధిని కోర్టు పేర్కొనకపోతే ఆ వ్యక్తిని గరిష్టకాలం(12 నెలలు) నిర్బంధంలో ఉంచుతారు. నిర్బంధ ఉత్తర్వులొచ్చాక ప్రతీ మూడు నెలలకు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వును సమీక్షించాల్సిన అవసరంలేదు’ అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. -
సినిమా తీయడం ఈజీ..రిలీజ్ కష్టం
‘‘మా బ్యానర్లో విడుదల చేసిన ‘భలేమంచి చౌకబేరమ్’ చిన్న సినిమా అయినా ప్రేక్షకాదరణ బాగుంది. కథ బాగుండటం వల్లే సినిమాను బాగా ఆదరిస్తున్నారు. రోజు రోజుకూ కలెక్షన్లు పెరుగుతున్నాయి. వసూళ్లు ఇంకా పెరిగి, మా సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నా’’ అని చిత్ర సమర్పకులు కె.కె. రాధామోహన్ అన్నారు. నవీద్, నూకరాజు, యామినీ భాస్కర్ కీలక పాత్రల్లో మురళీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భలేమంచి చౌకబేరమ్’. ఆరోళ్ల సతీష్ నిర్మించిన ఈ సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ చిత్రానికి కాన్సెప్ట్ అందించిన డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా తీయడం తేలిక.. కానీ, విడుదల కష్టం. మౌత్ టాక్‌తో రీచ్ అయ్యేలా చేయడం చాలా కష్టం. శనివారం సాయంత్రానికి మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మా టార్గెట్‌ని రీచ్ అయ్యాం’’ అన్నారు. ‘‘చిన్న సినిమా పెద్ద విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు మురళీకృష్ణ. ‘‘టిక్కెట్టుకి 100 రూపాయలు పెడితే 1000 రూపాయల వినోదం ఇచ్చే చిత్రం ‘భలేమంచి చౌకబేరమ్’’ అన్నారు నవీద్. ‘‘సినిమా విడుదల రోజు(శుక్రవారం) ఉదయం ఆటకు మా సినిమా ఓపెనింగ్స్ చూసి నిరుత్సాహపడ్డాం. అదేరోజు సాయంత్రానికి థియేటర్లు ఫుల్ అయ్యాయి’’ అన్నారు నూకరాజు. ‘‘టఫ్ సిచ్యువేషన్లో కాన్ఫిడెన్స్‌తో మా సినిమా విడుదల చేశాం. టాక్ బావుంది’’ అన్నారు సతీష్. యామినీ భాస్కర్, నటులు రాజా రవీంద్ర, ముస్తఫా, ఉద్ధవ్, పూర్ణాచారి పాల్గొన్నారు. -
పక్కా కమర్షియల్ చిత్రమిది
‘‘భలే మంచి చౌక బేరమ్’ చిన్న సినిమా. చిన్న సినిమాల కాన్సెప్ట్‌లు చాలా బాగుంటాయి. కానీ, ప్రేక్షకులు థియేటర్‌కి రారు. సినిమాలు చూడాలంటే అందులో ఏదో సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉండాలి. ఈ చిత్రంలో అలాంటి వైవిధ్యమైన పాయింట్ ఉంటుంది’’ అని దర్శకుడు మారుతి అన్నారు. నవీద్, ‘కేరింత’ నూకరాజు హీరోలుగా, యామినీ భాస్కర్ హీరోయిన్గా మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భలే మంచి చౌక బేరమ్’. కె.కె.రాధామోహన్ సమర్పణలో అరోళ్ళ సతీష్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ చిత్రానికి కాన్సెప్ట్ అందించిన మారుతి చెప్పిన విశేషాలు. ► కృష్ణానగర్‌లో తిరిగే ఇద్దరు బ్యాచిలర్స్కి దేశ రహస్యాలకు సంబంధించిన ఒక కవర్ దొరుకుతుంది. వాళ్లు దాన్ని ఎలా బేరం ఆడారు? అనేది ‘భలే మంచి చౌక బేరమ్’ మెయిన్ కాన్సెప్ట్. ఇందులో మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ► ఇదొక కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్. నేను చెప్పిన ఐడియాకి రవి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి డైలాగ్స్ రాశారు. ‘రోజులు మారాయి’ టీమ్ సెట్ అయ్యింది. కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ట్విస్ట్ ఉంటుంది. సెకండాఫ్ సీరియస్‌గా, కన్ఫ్యూజన్ కామెడీతో ఉండే పక్కా కమర్షియల్ చిత్రమిది. ► కె.కె. రాధామోహన్‌గారు మంచి టేస్ట్ ఉన్న నిర్మాత. మా సినిమా ఫస్ట్‌కాపీ చూసి, బాగా ఇంప్రెస్ అయిన ఆయన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ► ఇకపై పెద్ద చిత్రాలపైనే శ్రద్ధ పెట్టాలనుకుంటున్నా. ప్రస్తుతం చిన్న చిత్రాలు చేయదల్చుకోలేదు. నా సైకిల్ ప్రయాణం స్మూత్‌గా సాగుతోంది. నా తర్వాతి చిత్రం ‘భలే భలే మగాడివోయ్’లా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. -
చిన్న సినిమాల వల్లే ఈ స్థాయిలో ఉన్నా
‘‘చిన్న సినిమా అంటే పూర్తి రిస్క్ ఉంటుంది. ఆ చిన్న సినిమాల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. అందుకే దాన్ని వదులుకోవడం లేదు. చిన్న ఆలోచన నుంచి వచ్చిన కథ ‘భలే మంచి చౌక బేరమ్’. ఇది ఇన్నోవేటివ్ కాన్సెప్ట్. అందరికీ నచ్చుతుంది’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. నవీద్, ‘కేరింత’ నూకరాజు, యామినీ భాస్కర్, రాజారవీంద్ర, భద్రం, ముజ్తబా అలీఖాన్ ముఖ్య తారలుగా మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భలే మంచి చౌక బేరమ్’. కె.కె.రాధామోహన్ సమర్పణలో అరోళ్ళ సతీష్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సినిమా ట్రైలర్లను నటులు పృథ్వీ, సప్తగిరి విడుదల చేయగా, బిగ్ సీడీని డైరెక్టర్ వీవీ వినాయక్ రిలీజ్ చేస్తూ, ‘‘ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. టీమ్‌కి మంచి పేరు రావాలి’’ అన్నారు. ‘‘మా అరోళ్ళ గ్రూప్ నుంచి వస్తున్న తొలి సినిమా ఇది. ఈ కాన్సెప్ట్ ఇచ్చిన మారుతిగారికి ధన్యవాదాలు. ఈ సినిమా రిలీజ్‌కి రాధామోహన్‌గారు ఆక్సిజన్‌లాగా పని చేశారు’’ అన్నారు సతీష్‌కుమార్. ‘‘భలే మంచి చౌక బేరమ్’ సినిమాను రెండు సార్లు చూశా. కాన్సెప్ట్ నచ్చింది. ఈ సినిమా మొత్తం తయారు చేసి, సిల్వర్ ప్లేట్లో పెట్టి నా చేతికిచ్చి రిలీజ్ చేయమన్నారు. అంతకన్నా చౌకబేరమ్ దొరకదు. ఇదే నాకు ‘భలే మంచి చౌక బేరమ్’’ అన్నారు కేకే రాధామోహన్. ‘‘రవి, లక్కీ ఇద్దరూ నాకు చెరో చేయిలాంటివారు. నేను దర్శకత్వం వహించిన ‘రోజులు మారాయి’ చూసిన మారుతిగారు నమ్మి, ఈ సినిమా కథ ఇచ్చారు’’ అన్నారు మురళీకృష్ణ. సంగీత దర్శకుడు జేబీ, పాటల రచయిత పూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు. -
నేను మీ అమ్మాయినే అండీ
‘‘జీవితం ప్రతి రోజూ ఓ పాఠం నేర్పుతుంది. ఇప్పటివరకు నా సినీ జర్నీలో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. స్క్రిప్ట్స్‌ను ఎంచుకోవడంలో పరిణితిగా ఆలోచిస్తున్నాను. సక్సెస్ నా చేతిలో లేదు. నేను ఒప్పుకున్న సినిమాలో నా క్యారెక్టర్ కోసం ఎంతైనా కష్టపడతాను’’ అన్నారు యామినీ భాస్కర్. నవీద్, ‘కేరింత’ నూకరాజు, యామినీ భాస్కర్ ముఖ్య తారలుగా మురళీ కృష్ణ ముడిదాని దర్శకత్వంలో సతీష్ కుమార్ నిర్మించిన చిత్రం ‘భలే మంచి చౌక బేరమ్’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను కె.కె. రాధామోహన్ వచ్చే నెల 5న రిలీజ్ చేస్తున్నారు. అలాగే గురువారం యామిని బర్త్‌డేని పురస్కరించుకుని యూనిట్ సభ్యులు బుధవారం ఆమెతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా యామిని చెప్పిన విశేషాలు... ►నన్ను కొంత మంది నార్త్ అమ్మాయి అనుకుంటున్నారట. కానీ నేను పక్కా తెలుగు అమ్మాయిని. మాది విజయవాడ. ‘భలే మంచి చౌక బేరమ్’లో ఎదుటివారి బాధను చూడలేని ఆదర్షి అనే మంచితనం ఉన్న అమ్మాయిగా నటించాను. కానీ నా మంచితనాన్ని వాడుకుని ఈ సినిమాలో నన్ను హీరో మోసం చేస్తాడు. తర్వాత ఏంటీ? అనేది సినిమాలో తెలుస్తుంది. దర్శకుడు మురళీగారు సినిమాను బాగా తీశారు. షూటింగ్ టైమ్‌లో బాగా ఎంజాయ్ చేశాం. కాన్సెప్ట్ ఇచ్చిన డైరెక్టర్ మారుతీగారికి, సినిమాను తొందరగా రిలీజ్ చేస్తున్న రాధామోహన్‌గారికి ధన్యవాదాలు. ►‘నర్తనశాల’ కథ నచ్చే చేశాను. ఒక సినిమా సక్సెస్ ఆడియన్స్ చేతిలో ఉంటుంది. నెక్ట్స్ ఏ సినిమా కమిట్ కాలేదు. కథలు వింటున్నాను. తమిళంలోనూ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ పెద్ద బ్యానర్లో యాక్ట్ చేయాలని, మంచి కథ కుదరాలని వెయిట్ చేస్తున్నాను. -
భలే మంచి చౌక బేరమ్
‘ఈరోజుల్లో, బస్టాప్, ప్రేమకథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు’ వంటి హిట్ చిత్రాలతో దర్శకుడు మారుతి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పరచుకున్నారు. ఆయన కథ అందించిన చిత్రాలు కూడా మంచి ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా ఆయన ఇచ్చిన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘భలే మంచి చౌక బేరమ్’. నవీద్, ‘కేరింత’ నూకరాజు, యామినీ భాస్కర్, రాజారవీంద్ర, భద్రం, ముజ్తబా అలీఖాన్ ముఖ్య తారలు. మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో అరోళ్ల సతీష్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది. ‘అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్, పంతం’ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ‘భలే మంచి చౌక బేరమ్’ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చూశా. చాలా ఎంటర్టైనింగ్గా, ఇంట్రెస్టింగ్గా ఉంది. అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. అందుకే మా బేనర్లో విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, నేపథ్య సంగీతం: జె.బి, కెమెరా: బాల్‌రెడ్డి పి, సహ నిర్మాత: గుడ్ సినిమా గ్రూప్. -
దేశ రహస్యం ఎవరి చేతిలో?
దర్శకుడు మారుతి అందించిన కాన్సెప్ట్‌తో ‘రోజులు మారాయి’ ఫేమ్ దర్శకుడు ముడిదాని మురళీ కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘భలే మంచి చౌక బేరం’. నవీద్, నూకరాజు హీరోలుగా యామిని హీరోయిన్గా నటిస్తున్నారు. రాజా రవీంద్ర ముఖ్య పాత్ర చేస్తున్నారు. 30 ఏళ్ల అనుభవం ఉన్న మిలటరీ ఆఫీసర్ దేశ రహస్యాల మీద ఒక బుక్ రాస్తారు. ఆ బుక్ మిస్ ఐతే? అది ఎవరి చేతికైనా చిక్కితే? అనే కాన్సెప్ట్‌తో రూపొందించారు. ఈ చిత్రాన్ని ఎరోల్ల గ్రూప్ అదినేత డా. ఎరోల్ల సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ – ‘‘నాకు ఇష్టమైన సతీష్ గారు, శ్రీనివాస్‌తో కలిసి ఈ సినిమా నిర్మించాం. కాన్సెప్ట్ ఎలా చెప్పానో అలానే సినిమాగా మలిచారు మురళి. కథ, మాటలు అందించిన రవి నంబూరికి థ్యాంక్స్. నవీద్, నూకరాజులు బాగా చేశారు’’ అన్నారు. ‘‘మారుతిగారి సినిమా అంటే నా సొంత సినిమాలా భావిస్తాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాజ్ తరుణ్. ‘‘మారుతిగారు మంచి కాన్సెప్ట్‌తో నిర్మాతకు నాలుగు రూపాయిలు మిగిలేలా చూస్తారు. తెలుగు టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటంలో ముందుంటారు. ఈ సినిమా మంచి హిట్ సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు యస్.కె.ఎన్. ‘‘రెండో అవకాశం ఇచ్చిన మారుతి గారికి థ్యాంక్స్. టీమ్ అంతా చాలా ఇష్టపడి, కష్టపడి చేశాం. నిర్మాత సతీష్‌గారి సహకారంతో సినిమాను చాలా బాగా చేశాం. రవి నంబూరి మాటలు ఎసెట్ అవుతాయి. మా డార్క్ కామెడీ అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు దర్శకుడు మురళీ కృష్ణ. ‘‘మారుతి అందించిన కాన్సెప్ట్‌తో మురళి చాలా బాగా తెరకెక్కించాడు. ట్రైలర్ అందరికీ నచ్చింది. సమ్మర్‌కి రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత సతీష్. ‘‘మారుతిగారు కాన్సెప్ట్ ఇవ్వటమే సక్సెస్ కొట్టేశాం. డైరెక్టర్‌గారు ఫుల్ క్లారిటీ తో తెరకెక్కించారు. టైక్నికల్గా హై స్టాండర్డ్‌లో ఉంటుంది’’ అన్నారు నవీద్. ‘‘మంచి పాత్ర ఇచ్చిన మారుతిగారికి, మురళీగారికి ధన్యవాదాలు. ఈ సినిమా నాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందని అనుకుంటున్నాను’’ అన్నారు నూకరాజు. ఈ సినిమాకు సంగీతం: హరి గౌరా, సహ నిర్మాతలు : పిడమర్తి రవి, రెహమాన్. లైన్ ప్రొడ్యూసర్: దాసరి వెంకట సతీష్. -
విశాఖలో వ్యాపారిపై హత్యాయత్నం
విశాఖపట్నం గాజువాకలో వ్యాపారి నూకరాజుపై హత్యాయత్నం జరిగింది. బుధవారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఉన్న ఆరుగురు దుండగులు జీపులో వచ్చి నడిరోడ్డుపై నూకరాజుపై దాడి చేశారు. ఆయనను కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో నూకరాజు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయనను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. -
ఆయనపై ఎందుకంత ప్రేమ?
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్ : ఒకరు కాదు... ఇద్దరు కాదు ఏకంగా బ్లడ్‌బ్యాంక్‌లో పని చేస్తున్న సిబ్బందితో పాటు బ్లడ్ బ్యాంక్ లో సభ్యు లుగా ఉన్న వారంతా ఓ ఉద్యోగిపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఆయనపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ని విధులు నుంచి తప్పించకపోతే తాము వైదొలుగుతామని సభ్యులు హెచ్చరించినప్పటికీ అధికారుల్లో చలనం లేదు. పట్టణం లోని రెడ్‌క్రాస్ సొసైటీలో ల్యాబ్ టెక్నిషియన్‌గా పని చేస్తున్న నూకరాజు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని అందులో పని చేస్తున్న మహిళా సిబ్బంది రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్, కలెక్టర్ కాంతిలాల్ దండేకు ఫిర్యాదు చేశారు. అలాగే రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని లంచం అడిగారని కొంతమంది తెలిపారు. బ్లడ్ బ్యాంక్ సభ్యులమైన తమపై దురుసుగా, కులదూషణతో మాట్లాడుతున్నారని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధు లు రవూఫ్, రామకృష్ణారావు కూడా అధికారులకు ఫిర్యా దు చేశారు. వీటిపై స్పందించి కలెక్టర్ విజయనగరం తహశీల్దార్ వెంకటశివతో నెల రోజుల క్రితం విచారణ జరిపించారు. ఫిర్యాదుదారులు విచారణకు హాజరై ఫిర్యాదులో పేర్కొ న్న అంశాలు వాస్తవమేనని చెప్పారు. పది రోజులు క్రితం జిల్లా కు వచ్చిన రాష్ట్ర రెడ్‌క్రాస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం దృష్టికి కూడా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈ విషయూన్ని తీసుకువెళ్లారు. అయి నప్పటికీ అధికారులు ఇప్పటివరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నూకరాజు బ్లడ్ బ్యాంక్‌లో ఔట్ సోర్సింగ్ విధానంలో ల్యాబ్ టెక్నిషి యన్‌గా పని చేస్తున్నారు. ఆరోపణలు నిజమని తేలినప్పటికీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడానికి వెనుకంజవేస్తున్నారో తెలియడం లేదు. దీనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయమై రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ కార్యదర్శి అట్టాడ హేమసుందర్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా నూకరాజుపై విచారణ పూర్తయిందన్నారు. ఫైల్ కలెక్టర్ వద్ద ఉందని, ఒకటి, రెండు రోజుల్లో ఆదేశాలు జారీ చేయనున్నారని చెప్పారు. -
జాబు ఓ డాబు
బాబు హయాంలో మెడికల్ ఇన్వాలిడేషన్ అర్జీల రద్దు జీవో అన్యాయమైపోయిన వందలాదిమంది ఉత్తర్వు రద్దు చేసిన మహానేత విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ‘జాబు కావాలి... బాబు రావాలి...’ ఇదీ టీడీపీ నేతల ప్రచారం. యువతలోనూ ఇదే నినాదం తీసుకెళ్లి ఊదరగొడుతున్నారు. నిజంగా బాబు వస్తే ఉద్యోగాలొస్తాయో లేదో గానీ ఉన్న ఉద్యోగాలను ఊడగొడతారని ఆయన పాలన గురించి బాగా తెలిసిన ఉద్యోగులెవరైనా ఇట్టే చెబుతున్నారు. బాబు రాకూడదు బాబోయ్ అంటూ పలువురు ఆందోళన చెందుతున్నారు. కాం ట్రాక్టు, ఔట్సోర్సింగ్లలో పని చేస్తు న్న వారితో బాటు కారు ణ్య నియామక ఉద్యోగాల్లోనూ కోత వేస్తాడని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పినకోటకు చెందిన నూకరాజు వైద్య శాఖలో నాలుగో తరగతి ఉద్యోగం చేసేవాడు. అతడికి ఓ సారి రోడ్డు ప్రమాదంలో వెన్నుపూస విరిగిపోయింది. అప్పటి నుంచీ ఆరోగ్యం సహకరించేది కాదు. 54 ఏళ్ల వయస్సులోనూ అన్ని కార్యాలయాలకు తిరిగి ఫైల్స్ మోసుకురావడం కష్టమయ్యేది. వైద్యులు చూసి ఆరోగ్యం సహకరించడం లేదని నిర్ధారించారు. దీంతో తన కుమారునికి ఆ ఉద్యోగం ఇవ్వాలని 2002లో అర్జీ చేసుకున్నాడు. ఇలాంటి వారు జిల్లాలో దాదాపు అయిదారొందల మంది దరఖాస్తులు అప్పటికే ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో వుంచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దరఖాస్తులు వేలల్లోనే ఉన్నాయని గ్రహించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ ఇన్వాలిడేషన్‌లో వచ్చే అర్జీలకు ఇచ్చే ఉద్యోగాలను రద్దు చేస్తూ 2002 లో జీవో (ఎం ఎస్ నెంబర్ 202, 203) జారీ చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా వున్న వందలాది మంది తమ పిల్లలకు ఉద్యోగాలొస్తాయని మెడికల్ ఇన్వాలిడేషన్ చేయించుకున్న వారంతా అన్యాయమైపోయారు. ఒక పక్క జీతం రాక, పిల్లలకు ఉద్యోగం లేక, కేవలం పెన్షన్‌పైనే ఆధారపడి జీవిస్తున్నారు. వైఎస్సార్ ఉద్యోగమిచ్చారు...! మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగాలను కల్పించే జీవోలను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆరోగ్యం సహకరించక ఉద్యోగం చేయలేకపోతున్న వారికి తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించి తద్వారా కుటుంబ భారాన్ని మోసేందుకు ఉన్న ఏకైక అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు ఎన్జీవోలంతా ఏకమాయ్యరు. 2004లో వైఎస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఎన్జీవోలంతా 202, 203 జీవోలను రద్దు చేయాలని కోరడంతో 2008లో అక్టోబర్ 23న జీవో ఎంఎస్ నెంబర్ 661 ద్వారా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2008 నుంచీ ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా వున్న దాదాపు 40 రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 500 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. బాబు వస్తే జాబు ఎలా..! బాబు వస్తే జాబు ఎలా వస్తుంది. ఇంటింటికీ ఓ ఉద్యోగం అంటూ ప్రచారమే తప్పా ఆచరణ ఎలా సాధ్యం. ఓ ఊళ్లో 100 ఇళ్లుంటాయి. అక్కడ 100 మందికి ఉద్యోగాలిచ్చి ఏం చేయిస్తారో ఆయనే చెప్పాలి. ఇదంతా నిరుద్యోగులను మోసగించడమే. - అశోక్, నిరుద్యోగి, పిఠాపురం కాలనీ పర్మినెంట్ ఉద్యోగులుండరు..! బాబు వస్తే రెగ్యులర్ ఉద్యోగులుండరు. అంతా ఔట్సోర్సింగ్ సిబ్బందే. వారికి జీతాలు ఇవ్వరు..ప్రజలకు పని చేయరు. అంతా జన్మభూమి..మన ఖర్మ భూమి మాత్రమే మిగులుద్ది. - నాగమణి, జీవీఎంసీ ఔట్‌సోర్సిగ్ ఉద్యోగి


