భలే మంచి చౌక బేరమ్‌ | 'Bhale Manchi Chowka Beram' release date locked | Sakshi
Sakshi News home page

భలే మంచి చౌక బేరమ్‌

Sep 17 2018 2:42 AM | Updated on Sep 17 2018 2:42 AM

'Bhale Manchi Chowka Beram' release date locked - Sakshi

నవీద్, యామినీ భాస్కర్, నూకరాజు

‘ఈరోజుల్లో, బస్టాప్, ప్రేమకథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు’ వంటి హిట్‌ చిత్రాలతో దర్శకుడు మారుతి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ ఏర్పరచుకున్నారు. ఆయన కథ అందించిన చిత్రాలు కూడా మంచి ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా ఆయన ఇచ్చిన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘భలే మంచి చౌక బేరమ్‌’. నవీద్, ‘కేరింత’ నూకరాజు, యామినీ భాస్కర్, రాజారవీంద్ర, భద్రం, ముజ్‌తబా అలీఖాన్‌ ముఖ్య తారలు. మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో అరోళ్ల సతీష్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్‌ 5న విడుదల కానుంది.

‘అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్‌ టైగర్, పంతం’ వంటి హిట్‌ చిత్రాలను నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ ‘భలే మంచి చౌక బేరమ్‌’ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చూశా. చాలా ఎంటర్‌టైనింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. అందుకే మా బేనర్‌లో విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి  సంగీతం: హరి గౌర, నేపథ్య సంగీతం: జె.బి, కెమెరా: బాల్‌రెడ్డి పి, సహ నిర్మాత: గుడ్‌ సినిమా గ్రూప్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement