జబర్దస్త్‌ కమెడియన్ల బ్రేకప్‌? గొడవలు నిజమేనన్న నూకరాజు | Comedian Nookaraju has recently addressed questions about his break up with his girlfriend, Angel Asia. - Sakshi
Sakshi News home page

నూకరాజు- ఆసియా బ్రేకప్‌? జబర్దస్త్‌ కమెడియన్‌ ఏమన్నాడంటే..

Published Fri, Apr 19 2024 3:43 PM

Jabardasth Nukaraju Respond on Breakup Rumours With Asiya - Sakshi

పటాస్‌ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు నూకరాజు. తర్వాత జబర్దస్త్‌ షోలో భాగమయ్యాడు. టీమ్‌లో ఒకరి కింద పని చేసే స్థాయినుంచి టీమ్‌ లీడర్‌గా ఎదిగాడు. అతడి ప్రేయసి ఆసియాతో కలిసి కామెడీ షోలో పంచులు పేలుస్తూ ఉంటాడు. చాలాకాలంగా ప్రేమలో ఉన్న నూకరాజు, ఆసియా కొంతకాలంగా కలిసి కనిపించడం లేదు. దీంతో ఈ లవ్‌ బర్డ్స్‌కు ఏమైంది? వీళ్లు బ్రేకప్‌ చెప్పుకున్నారా? అని అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఆసియాకు, నాకు గొడవలు
తాజాగా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తూ యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్‌ చేశాడు నూకరాజు. అతడు మాట్లాడుతూ.. 'ప్రేమలో గొడవలు, అలకలు, బుజ్జగింపులు సహజమే!  అలా ఆసియాకు, నాకు మధ్య చిన్నచిన్న గొడవలు జరిగాయి. తను నాపై అలిగింది. వంద శాతం తప్పు నాదే! మేమిద్దరం మాట్లాడుకోలేదు. అయితే తప్పు ఎవరిదైనా ఆసియానే స్వయంగా వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటుంది. నాపై ఎక్కువ ప్రేమ చూపిస్తుంది.

ఇగో వల్ల..
మొన్న నేను దుబాయ్‌ వెళ్లాను. ఐదురోజుల తర్వాత తిరిగొచ్చాను. అలా మా మధ్య మాట్లాడుకునే తీరిక కూడా లేకుండా పోయింది. తను ఫస్ట్‌ మాట్లాడాలని ఎదురుచూశాను. నాకు కాల్‌ చేసి ఉండొచ్చేమో కానీ దుబాయ్‌లో ఉండటం వల్ల నా లైన్‌ కలిసి ఉండకపోవచ్చు. ఇగోతో ఆమెకు బర్త్‌డే విషెస్‌ కూడా చెప్పలేదు. అయినా తనే తర్వాత మెసేజ్‌ చేసింది.

తనే ఫస్ట​ మెసేజ్‌
విషెస్‌ చెప్పనందుకు నా మీద కోపం లేదా? అంటే బాధ మాత్రమే ఉందని చెప్పింది. చిన్న చిన్న ఇగోతో ప్రేమను దూరం చేసుకోకండి. తప్పు ఎవరు చేసినా ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గితే ఆ ప్రేమ పెళ్లిదాకా వెళ్తుంది. తనను ఎంత బాధపెట్టానో అంతే హ్యాపీగా ఉంచాలని నిర్ణయించుకున్నాను. తనకు ఆలస్యంగానైనా సరే బర్త్‌డే సర్‌ప్రైజ్‌ ఇస్తాను' అని నూకరాజు చెప్పుకొచ్చాడు. తమ బంధం ముక్కలు కాలేదని క్లారిటీ ఇచ్చాడు.

చదవండి: ఓటింగ్‌ కేంద్రంలో ఆమె కాళ్లకు నమస్కరించి సెల్ఫీ దిగిన విజయ్‌ సేతుపతి

Advertisement
 
Advertisement
 
Advertisement