విశాఖలో వ్యాపారిపై హత్యాయత్నం | trader Nukaraju attacked in Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో వ్యాపారిపై హత్యాయత్నం

Dec 10 2014 3:25 PM | Updated on May 3 2018 3:17 PM

విశాఖఫట్నంలోని గాజువాకలో వ్యాపారి నూకరాజుపై హత్యాయత్నం జరిగింది.

విశాఖపట్నం గాజువాకలో వ్యాపారి నూకరాజుపై హత్యాయత్నం జరిగింది. బుధవారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఉన్న ఆరుగురు దుండగులు జీపులో వచ్చి నడిరోడ్డుపై నూకరాజుపై దాడి చేశారు. ఆయనను కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనలో నూకరాజు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయనను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement