ఏం పర్వాలేదు.. ఇసుక తవ్వుకోండి..! | Controversy Comments from MLA Vemireddy Prashanthi Reddy | Sakshi
Sakshi News home page

ఏం పర్వాలేదు.. ఇసుక తవ్వుకోండి..!

Aug 26 2026 2:03 PM | Updated on Aug 26 2026 2:03 PM

Controversy Comments from MLA Vemireddy Prashanthi Reddy

నెల్లూరు జిల్లా: నదుల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం అమల్లో ఉన్నా, తవ్వుకోండంటూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల సంరక్షణలో భాగంగా నదుల్లో ఇసుక తవ్వకాలను నిర్ణీత కాలం పాటు నిలిపేస్తారు. అయితే ఈ నిషేధం కొనసాగుతున్న తరుణంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 

బుచ్చిరెడ్డిపాళెంలో ఓ టీడీపీ నేత శుభకార్యానికి హాజరైన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. భవన నిర్మాణ రంగ కార్మికులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇసుక లభ్యతపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీఎం సూచనల మేరకు రీచ్‌ల నుంచి పగటిపూట ఇసుకను తరలించుకోవచ్చని, యంత్రాలను ఉపయోగించకుండా మనుషుల ద్వారా ట్రాక్టర్లలో పంపొచ్చని నేతలకు సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలు అక్రమార్కులకు మరింత ఊతమిచ్చే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 

Vemireddy Prashanthi Reddy   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement