చాలామంది యువత ఐఐటీలో చదవాలి మంచి టెక్ కంపెనీలో జాబ్ సంపాదించాలి అని కలలు కంటారు. అయితే అందరు ఆ డ్రీమ్‌ని నిజం చేసుకోలేరు. అది కొందరికే సాధ్యమవుతుంది. ఇక్కడ ఈ యువకుడు అలానే ఆ కలను నిజం చేసుకోలేకపోయాడు. కానీ ఆ కంపెనీని తనకు స్వాగతం పలికేలా సొంతంగా తనకంటూ మార్గాన్ని సృష్టించి ఆ డ్రీమ్‌ని నెరవేర్చుకున్నాడు. కష్టించి పనిచేస్తే..అనుకున్నది మరొకరకంగా సాధించి తీరుతామనేందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు.
అతడే భవిష్య రాఘవ్. పాఠశాలల రోజుల్లో విద్యార్థిగా ఉండగా తల్లిదండ్రులు అతడిపై ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. అతడు బాగా చదివి ఐఐటీలో సీటు సాధించి గూగుల్‌లో ఉద్యోగం సంపాదించాలని కోరుకునేవారు. అతడు కూడా అలానే అనుకున్నాడు. అయితే అన్నీ అనుకున్నట్లుగా జరిపోవు కదా..! ఇక్కడ రాఘవ్ ఐఐటీలో సీటు సాధించ లేకపోయాడు. ఇక గూగుల్‌లో కెరీర్ అనే మాటకే ఛాన్స్ ఏది అనుకున్నారు అంతా.
కానీ అతడు తన డ్రీమ్‌ని వదిలేయాలని అనుకోలేదు. సొంతంగా కంటెంట్ క్రియేషన్ చేయడం ప్రారంభించి..తనకంటూ ఒక ప్రత్యేక కెరీర్ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక పక్క నేర్చుకుంటూ..పనిచేస్తూ..నిరంతరం ప్రయత్నిస్తూ ముందుకుసాగాడు. ఈ రోజు ఏకంగా Google Pixel 11 Series ప్రత్యేక లాంచ్ ఈవెంట్‌కు స్వయంగా Google నుంచే ఆహ్వానం లభించింది రాఘవ్‌కి. ఆ విషయాన్నే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నాడు.
తానుసాంప్రదాయ మార్గంలో గూగుల్‌ని చేరుకోలేకపోయా..కానీ తన ప్రత్యేక మార్గం ద్వారా అదే కంపెనీకి చేరుకుని కలలు ఎన్నటికీ చెదిరిపోవు అని నిరూపించగలిగానని ఆనందంగా చెబుతున్నాడు. తన కెరీర్‌లో ఊహించని మలుపుకి సంబంధించిన స్ఫూర్తిదాయక కథను షేర్‌చేస్తూ..గూగుల్ కార్యాలయంకి వెళ్లినప్పుడు దిగిన ఫోటోలను పంచుకున్నారు.
(చదవండి: ట్రావెల్ వీడియోల్లో ఇంత కిక్ ఉందా? ఏడాదికి రూ.85 లక్షలు ఆర్జించే ఉద్యోగాన్నే..)


