సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీశైలం వడ్డెర సత్రంలో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన సుధాకర్, ఆదిలక్ష్మి,మల్లేశ్వరి, శ్రీదేవి, మణికంఠగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
సత్రంలోని 11వ నంబర్ గదిని తీసుకున్న కుటుంబం.. మూడు రోజులుగా బయటకు రాలేదు. గది నుంచి దుర్వాసన రావడంతో సత్రం సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు తెరిచి చూడగా ఐదుగురు మృతి చెంది ఉన్నారు. ఫ్యాన్‌కు ఇద్దరు పురుషులు ఉరివేసుకున్నట్లు పోలీసులు గుర్తింంచారు.


