నేడు ముఖ్య నేతలతో వైఎస్ జగన్‌ కీలక సమావేశం | YS Jagan To Hold Crucial Meeting With Key Leaders Over Local Bodies Elections, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

నేడు ముఖ్య నేతలతో వైఎస్ జగన్‌ కీలక సమావేశం

Aug 25 2026 9:01 AM | Updated on Aug 25 2026 9:33 AM

Ys Jagan Key Meeting With Key Leaders On Local Bodies Elections

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ రీజినల్‌ కో-ఆర్డీనేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో–ఆర్డినేషన్, అనుబంధ విభాగాలు), స్టేట్‌ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీలు పాల్గొననున్నారు.

రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ తదితర కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. ఈ అంశాలపై పార్టీ నాయకులకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement