మీరెన్ని కేసులు పెట్టినా.. నా గొంతు ఆగదు: అంబటి | Cases Won't Silence Me, My Criticism Will Continue: Ambati To Kutami | Sakshi
Sakshi News home page

మీరెన్ని కేసులు పెట్టినా.. నా గొంతు ఆగదు: అంబటి

Aug 25 2026 10:37 AM | Updated on Aug 25 2026 10:49 AM

Cases Won't Silence Me, My Criticism Will Continue: Ambati To Kutami

సాక్షి, గుంటూరు: తనపై నమోదైన కేసులన్నీ ప్రస్తుతం ఎఫ్‌ఐఆర్‌ దశలోనే ఉన్నాయని, ఇప్పటివరకు ఛార్జ్‌షీట్లు దాఖలు చేయలేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఒకే ఘటనకు సంబంధించి పలు కేసులు నమోదు చేసి తనను వేధించాలని చూస్తున్నారని చెప్పారు. రాజకీయ విమర్శలు చేసినందుకే కేసులు పెడుతున్నారని, వాటికి భయపడేది లేదని స్పష్టం చేశారు.

తనపై వరుస కేసుల వ్యవహారంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టినందుకు సీఐడీతో పాటు మరో కేసు నమోదు చేశారని, ఇటీవల పట్టాభిపురం పోలీసులు కూడా తనపై కేసు పెట్టారని తెలిపారు. తన అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌లో ‘ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన పార్టీ’ అంటూ పాటను పోస్టు చేశానని చెప్పారు. చంద్రబాబు తరచూ ‘గొడ్డలి పార్టీ’ అంటూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దానికి కౌంటర్‌గా ‘వెన్నుపోటు పార్టీ’ అంటూ రాజకీయ వ్యంగ్యంతో పోస్టు చేశానన్నారు.

ఎన్టీఆర్‌ మీద కృష్ణ సినిమాలే తీశారు
వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై ఏఐ వీడియోలతో అత్యంత అవమానకరంగా పోస్టులు పెట్టిన వారిపై తాను ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు కేసులు నమోదు చేయలేదని అంబటి ఆరోపించారు. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయమా? అని ప్రశ్నించారు. రాజకీయ విమర్శలు, వ్యంగ్యాలు ప్రజాస్వామ్యంలో సాధారణమేనన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా ఎందుకు వ్యవహరించలేకపోతున్నారని అంబటి నిలదీశారు.

‘‘రాజకీయ విమర్శలు చెయ్యకూడదా?. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనపై వ్యంగంగా అనేక చర్యలు కనిపించాయి. ఎన్టీఆర్‌ను పోలిన వేషధారణతో క్యారెక్టర్‌తో హీరో కృష్ణ ఏకంగా సినిమాలు తీశారు. ఆ కాలంలో ఇలాంటివేవీ జరగలేదే’’ అని అంబటి గుర్తు చేశారు.

‘కేసులకు భయపడేది లేదు’
కేసులతో బెదిరించాలని చూస్తే తాను భయపడబోనని అంబటి అన్నారు. పోలీసుల వాహనంలో గంజాయి దొరికిన ఘటనపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సత్తెనపల్లి, చిలకలూరిపేట, రేపల్లె ప్రాంతాలలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఐజీ త్రిపాఠికి వాటాలు వస్తున్నాయి. పోలీసులే గంజాయి అమ్మి ఐజీకి డబ్బులు ఇస్తున్నారు. అందరూ కుమ్మక్కై వాటాలు పంచుకుంటున్నారు అని అన్నారు. రఘురామకృష్ణరాజుపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని అంబటి పేర్కొన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తోంది టీడీపీ కాదని, ‘వెన్నుపోటు పార్టీ’ అని విమర్శించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా రాజకీయ విమర్శలు చేయడం ఆపబోనని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: బాలయ్య తంతారేమోనని భయపడి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement