లైఫ్‌ లాంగ్‌ రక్ష | YouTuber Dettadi Harika talks about Rakhi festival | Sakshi
Sakshi News home page

లైఫ్‌ లాంగ్‌ రక్ష

Aug 28 2026 4:28 AM | Updated on Aug 28 2026 4:28 AM

YouTuber Dettadi Harika talks about Rakhi festival

యూ ట్యూబర్‌గా... నటిగా... బిగ్‌ బాస్‌ ద్వారా తెలుగువారికి చేరువ అయ్యింది హారిక. దేత్తడి  హారికగా పేరు తెచ్చుకుంది. తాము చేసుకునే రాఖీ పండగ గురించి చెప్పింది ఇలా..

‘మా అన్నయ్య వంశీ కార్తీక్‌ అంటే.. నాకు ఫాదర్‌ లెక్క. అన్నగా ధైర్యాన్ని, నాన్నగా ప్రేమను పంచుతాడు. రక్షాబంధన్‌ అనేది ఏడాదికి ఒక్కసారి సంప్రదాయంగా వేడుకగా జరుపుకుంటాం. కానీ, ఆ రక్ష మళ్ళీ వచ్చే ఏడాది రక్షాబంధన్‌ వచ్చేవరకు ఉంటుంది. నమ్మకమే కాదు, వాస్తవం. చిన్నప్పటినుంచి నేను అల్లరి పనుల్లో ఫస్ట్‌. దాంతో సమస్యలు కూడా వస్తుంటాయి. అన్నయ్య మాత్రం చాలా కూల్‌గా వాటిని పరిష్కరిస్తాడు. 

 ఫోన్‌లో మూవీస్‌ రీల్స్‌ ఎక్కువసేపు చూస్తుంటాను అని.. కళ్ళకింద డార్క్‌సర్కిల్స్‌ వస్తాయని, కిందటి ఏడాది లాప్ టాప్  కొనిచ్చాడు. ఆ లాప్ టాప్  ఇప్పుడు వాడుతున్నాను. నాకు ఎక్కువ ఉపయోగపడే వస్తువులు ఏమయినా ఉన్నాయంటే అవి అన్నయ్య ఇచ్చినవే అయి ఉంటాయి. ఏదయినా ఇష్యూ వస్తే ‘అన్నయ్య ఉన్నాడుగా... చూసుకుంటాడు’ అనే ధైర్యం. స్నేహితులు ఎంతమంది ఉన్నా.. చేసిన పనులు, వచ్చిన ప్రశంసలు.. ఆ రోజు చివరలో అన్నయ్యతో షేర్‌ చేసుకోవాల్సిందే. నా గురించి నాకన్నా మా అన్నయ్య ఎక్కువ ఆలోచిస్తాడు. మాలాంటి అన్నయ్య ఉన్న ప్రతి చెల్లీ ఫుల్‌ హ్యాపీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement