జెన్– జీ రక్షాబంధన్
ఒకప్పుడు రక్షణ అంటే బలమైన హస్తం. మణికట్టుపై ముడిపడే దారం. ఆపదలో ఆదుకునే అన్నయ్య భరోసా. కానీ, కాలం మారింది. ఇప్పుడు జెన్ జి. వారి దృష్టిలో రక్షణ అంటే కేవలం మగాడు వచ్చి కాపాడటం కాదు... ఒక మహిళకు మరో మహిళ తోడుగా నిలబడటం, తనను తానే రక్షించుకుంటానని వాగ్దానం చేసుకోవడం. అందుకే మార్కెట్‌లో ‘సిస్టర్‌హుడ్ రాఖీ’లు... ‘సెల్ఫ్‌రాఖీ’లు రాఖీ పౌమి వేళ సోషల్ మీడియా వేదికగా రక్షాబంధన్ 2.0 స్వరూపం..
రాఖీ పౌమి వచ్చిందంటే చాలు... అన్నాచెల్లెళ్ల బంధం అనివార్యంగా ఇళ్లను ఉద్వేగభరితం చేస్తుంది. ‘అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి’ వంటి పాటలు రేడియోలో మోగుతాయి. అన్నను గుర్తు చేసుకోని చెల్లెలు, చెల్లెలి శిరస్సు తాకి ఆశీర్వదించి, ఆమె చేతి మీదుగా రక్షాబంధనం కట్టుకోని అన్న ఉండడు. రాఖీ వచ్చిందంటే ఇంటికి కళ. రక్తానుబంధపు తీపి మిఠాయి సమయం.
అయితే ఈసారి రాఖీ పండగలో కొత్త ధోరణులు కనిపిస్తున్నాయి. అన్నదమ్ములు లేని అమ్మాయిలే కాదు... ఉన్న అమ్మాయిలు కూడా తమ అక్కాచెల్లెళ్లకు, ప్రాణస్నేహితురాళ్లకు రాఖీలు కడుతున్నారు. పురాణాల్లో చెప్పిన ద్రౌపది, శ్రీకృష్ణుల సెంటిమెంట్‌ను గౌరవిస్తూనే... ఈ కాలానికి తగినట్టుగా తమకు తాము సొంత రక్షణ వ్యవస్థను నిర్మించుకోవాలని భావిస్తున్నారు అమ్మాయిలు. ఇది పండగ జరుపుకునే పద్ధతి మారడం కాదు... స్త్రీల ఆత్మవిశ్వాసానికి, ఐక్యతకు నిదర్శనం.
‘రక్ష’ అంటే శారీరక బలం కాదు
సంప్రదాయం ప్రకారం రాఖీ కట్టించుకున్న సోదరుడు సోదరిని కాపాడతానని మాట ఇస్తాడు. కానీ ఇవాళ్టి రోజుల్లో ఒక అమ్మాయి బయటకు వెళ్లినప్పుడు, ఆఫీసులో ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పుడు లేదా జీవితంలో కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెకు తక్షణ రక్షణగా నిలుస్తున్నది ఎవరు? తోటి మహిళే! హాస్టల్ గదిలో అనారోగ్యంతో బాధపడుతుంటే బ్రెడ్ తెచ్చి ఇచ్చే రూమ్‌మేట్, ఆఫీసు పాలిటిక్స్ నుండి కాపాడే మహిళా కొలీగ్, అర్ధరాత్రి ప్రయాణంలో తోడుగా నిలిచే అపరిచిత స్త్రీ... వీరంతా ఒకరికొకరు రక్షకులే. శారీరక బలంతో కాపాడటం మాత్రమే రక్షణ కాదు; ఒక అమ్మాయి కుంగిపోతున్నప్పుడు వెన్నుతట్టి ‘నేనున్నా’ అనే మానసిక ధైర్యాన్ని ఇవ్వడం కూడా రక్షణే. ఆ నమ్మకానికే ఈ తరం అమ్మాయిలు రాఖీ కడుతున్నారు. రక్షణ అనేది జెండర్‌తో కాదు, గుండె ధైర్యంతో ముడిపడి ఉందని చాటుతున్నారు.
మారిన కుటుంబ వ్యవస్థ
ఒకప్పటి ఇళ్లకూ ఇప్పటి ఇళ్లకూ సాపత్యం లేదు. ఉమ్మడి కుటుంబాలు పోయి మైక్రో ఫ్యామిలీలు వచ్చాయి. ఒకప్పుడు అన్నయ్యలకు మణికట్టు నిండా రాఖీలే. ఇప్పుడు సింగిల్ చైల్డ్ ఇంటిలో అబ్బాయి చేతికి రాఖీ కట్టే ఆడపిల్ల ఉండటం లేదు. అలాగే సింగిల్ డాటర్ లేదా టూ డాటర్స్ కుటుంబాలు పెరిగాయి. వీళ్లు రాఖీ కట్టడానికి చేయి దొరకడం లేదు. అందుకే అన్నదమ్ములు లేరనే వెలితి తెలియకుండా గత కొన్నేళ్లుగా చెల్లెలికి అక్కే ‘నేనే నీ రక్ష’ అంటూ రాఖీలు కట్టుకోవడం ఆనవాయితీగా మారుతోంది. అన్నాచెల్లెళ్ల బంధమే కాదు, అక్కాచెల్లెళ్ల బంధం కూడా రాఖీయే అని చెప్పే తల్లులు పెరుగుతున్నారు. ఈ మార్పును బ్రాండ్స్ కూడా సొమ్ము చేసుకుంటున్నాయి.
అమెజాన్ వంటి సైట్లలో అక్కాచెల్లెళ్ల కోసం ప్రత్యేకంగా జీట్ట్ఛట ్ఞu్చఛీ ఖ్చజుజిజీ, ఆజీజ జీట/ఆ్చby జీటఖ్చజుజిజీటపేరుతో మార్కెట్‌లో రాఖీలు తెస్తున్నాయి. పాతకాలపు డిజైన్ల స్థానంలో ‘విమెన్ ఎంపవర్‌మెంట్ సింబల్’్స ఉన్న రాఖీలు ఇవాళ అమ్ముడవుతున్నాయి.
ట్రెండింగ్‌లో సెల్ఫ్–లవ్
ఈసారి డిజిటల్ స్పేస్‌లో # జీట్ట్ఛటటఊౌట జీట్ట్ఛటటహ్యాష్‌ట్యాగ్ మార్మోగిపోతోంది. కేవలం తోబుట్టువులకే పరిమితం కాకుండా, తమకు స్ఫూర్తినిచ్చిన ఇతర మహిళలకు, మహిళా బాస్‌లకు అమ్మాయిలు కృతజ్ఞతగా రాఖీలు పంపుతున్నారు. అంతేకాదు, మరో అద్భుతమైన ట్రెండ్ ఏంటంటే... ’సెల్ఫ్ లవ్ రాఖీ’. తమ మణికట్టుకే తాము రాఖీ కట్టుకుంటూ ‘నా జీవితానికి, నా రక్షణకు, నా ఆర్థిక స్వాతంత్య్రానికి, నా ఎదుగుదలకు నేనే బాధ్యత వహిస్తాను’ అని అమ్మాయిలు సెల్ఫ్–డిక్లరేషన్ ఇస్తున్నారు. ‘అమ్మాయిలు ఎవరికో రాఖీ కట్టి, నన్ను కాపాడమని వేడుకునే రోజులు పోయాయి. మనల్ని మనం కాపాడుకునే ధైర్యం మన చేతుల్లోనే ఉంది’ అని అంటున్నారు వాళ్లు.
అసలు ‘రాఖీ’ ఎప్పుడూ ‘దారం’ కాదు. అది ఒక మాట. ‘భయపడకు, నేనున్నాను‘ అనే మాట. ఇన్నాళ్లూ ఆ మాటను అబ్బాయిలు మాత్రమే చె΄్పాలి అనుకున్నాం. ఇప్పుడు అమ్మాయిలు కూడా చెబుతున్నారు. అమ్మాయిలు అమ్మాయిలకు రాఖీ కట్టుకోవడం అంటే పురుష సమాజానికి వ్యతిరేకంగా మారడం కాదు... తమలోని అంతర్గత శక్తిని గుర్తించడం. ఆడపిల్ల ఒంటరి కాదు, ఒక అమ్మాయికి మరో అమ్మాయి తోడుంటే ఆ శక్తే వేరు అని చాటిచెప్పడం. అందుకే ఈ రాఖీ పౌమి కేవలం తోబుట్టువుల పండగ మాత్రమే కాదు... స్త్రీ శక్తి ఐక్యతా దినోత్సవం!


