వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమే..: జేసీ ప్రభాకర్‌రెడ్డి | TDP Leader JC Prabhakar Reddy says It will be difficult to win next election | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమే..: జేసీ ప్రభాకర్‌రెడ్డి

May 29 2025 6:08 AM | Updated on May 29 2025 6:08 AM

TDP Leader JC Prabhakar Reddy says It will be difficult to win next election

పథకాలు రాలేదని ప్రజలు 

తిడుతున్నారు.. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి 

జనాలకు బుద్ధిలేదని వ్యాఖ్య

తాడిపత్రి టౌన్‌: సంక్షేమ పథకాలు రావడం లేదంటూ ప్రజలు తిడుతు­న్నా­రని, వచ్చే  ఎన్నికల్లో గెల­వడం కష్టంగానే ఉం­టుందని అనంతపురం జిల్లా తాడి­పత్రి మున్సిపల్‌ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాడి­పత్రి పట్టణంలోని మున్సిపల్‌ కార్యా­లయం వద్ద ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు సోషల్‌ మీడియాలో బుధవారం వైరల్‌గా మారాయి. 

ప్రతిరోజూ.. తాడిపత్రిలో పర్యటిస్తున్నామని, ప్రభుత్వ పథకాలు రాలేదని ప్రజలు మమ్మల్ని తిడుతున్నారని ఆయనన్నారు. గత ప్రభుత్వంలో అమ్మఒడి.. అదీ ఇదీ అని 15 వేలు ప్రజలకు నేరుగా డబ్బులు జేబులో పడేవని, ఇప్పుడు డబ్బులు అందకపోవడంతో నాయకులను ప్రజలు  తిడుతున్నారని జేసీ చెప్పారు. ‘రోడ్లు బాగా లేకుండాలేవు. నీళ్లు తక్కువేమీ లేవు. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ బాగా చేశాం. 

అయినా ప్రజలకు కావాల్సింది ఏమిటంటే.. నేరుగా డబ్బులు జేబులోకి చక్కగా పడాలి. ఒక్కనికీ బుద్ధిలేదు. ఈ జనాలకు బుద్ధిలేద’ని ప్రభాకర్‌రెడ్డి ఆవేశంగా అన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని దాదాపు 43 కిలోమీటర్ల మేర పెన్నానదిలో ఇసుకను ఇష్టమొచ్చినట్లు ఎవ్వరు పడితే వాళ్లు తవ్వుకుని అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. తాము కూడా ఈసారి ఓపెన్‌గానే ఇసుక అమ్ముదామనుకుంటున్నానని జేసీ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement