తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత.. వైఎస్సార్‌సీపీ నేతపై దాడి! | YSRCP Pedda Reddy Tadipatri Protest Related Updates, Former MPs Thalari Rangaiah And Madhav Arrested | Sakshi
Sakshi News home page

తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత.. వైఎస్సార్‌సీపీ నేతపై దాడి!

Jun 26 2026 9:10 AM | Updated on Jun 26 2026 11:13 AM

YSRCP Pedda Reddy Tadipatri Protest Related Updates

తాడిపత్రి అప్‌డేట్స్‌..

మాజీ ఎంపీలు తలారి రంగయ్య, మాధవ్‌ అరెస్ట్‌..

  • తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు.
  • మాజీ ఎంపీలు తలారి రంగయ్య, మాధవ్‌ అరెస్ట్‌.
  • తాడిపత్రి వెళ్తున్న రంగయ్య, మాధవ్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.
  • తాడిపత్రి వెళ్లకుండా వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు.
  • మహిళా కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యం.
  • మహిళా కార్యకర్తలను లాగిపడేసిన పోలీసులు.
  • పోలీసుల తీరుపై పార్టీ నేతల ఆగ్రహం. 

 

తాడిపత్రిలో హైటెన్షన్

  • పెద్దారెడ్డి అరెస్ట్‌ను అడ్డుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు
  • ఇంటి లోపల నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
  • కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద భారీ ఎత్తున పోలీసుల మోహరింపు
  • రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి
  • తాడిపత్రి బయలుదేరిన అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి లను అడ్డుకున్న పోలీసులు
  • భారీగా స్తంభించిన ట్రాఫిక్
  • బారికేడ్లను అడ్డుగా పెట్టి వైఎస్సార్‌సీపీ నేతలు కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు

 

వైఎస్సార్‌సీపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత..

  • తాడిపత్రి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వర రెడ్డిలను అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులతో అనంత, విశ్వ వాగ్వాదం
  • పోలీసులు, వైఎస్సార్‌సీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట

కేతిరెడ్డి పెద్దారెడ్డి కామెంట్స్

  • తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతల నినాదాలు
  • కేతిరెడ్డి పెద్దారెడ్డి కామెంట్స్
  • తాడిపత్రి నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రక్తంతో రెడ్‌బుక్ తడిచి పోయింది
  • తాడిపత్రిలో పోలీసులు ఉన్నా ప్రయోజనం లేదు
  • పోలీసులు కళ్ల ముందే పార్టీ నాయకుడు శివ కేశవ రెడ్డిపై దాడి చేశారు
  • పోలీసులపై దాడి చేసినా దిక్కు లేదు..
  • పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి

పెద్దారెడ్డి ఇంటిబయట ఉద్రిక్తత

  • తాడిపత్రి భగత్ సింగ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిబయట ఉద్రిక్తత
  • తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ గాంధీ విగ్రహం వద్ద సామూహిక నిరసనకు పిలుపు ఇచ్చిన పెద్దారెడ్డి
  • ఇంటి బయట అడ్డుకున్న పోలీసులు, రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న పెద్దారెడ్డి 

👉అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హింసాత్మక రాజకీయాలను నిరసిస్తూ గాంధీ విగ్రహం వద్ద సామూహిక నిరాహార దీక్షకు వైఎస్సార్‌సీపీ పిలుపునివ్వడంతో పట్టణంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా.. పార్టీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు.

👉దీంతో, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటి బయట రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యం కాపాడాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. పోలీసుల కనుసన్నల్లో మట్కా, గంజాయి సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. ఉదయం నుంచి మా నెత్తిమీద డ్రోన్లు ఎగురవేస్తున్నారు. పోలీసులే రౌడీలుగా వ్యవహరిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి తొత్తులుగా పోలీసులు మారారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

👉మరోవైపు.. పెద్దారెడ్డి ఇంటికి భారీ ఎత్తున వైఎస్సార్‌సీపీ నాయకులు కార్యకర్తలు చేరుకుంటున్నారు. అయితే, పెద్దారెడ్డి ఇంటికి వెళ్లకుండా నాలుగు వైపుల పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. తాడిపత్రికి వచ్చే అన్ని వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. భగత్ సింగ్ నగర్ వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. పోలీసులు.. భగత్ సింగ్ నగర్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకోవడంతో వారంతా నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపైనే టిఫిన్ తింటూ నిరసన తెలుపుతున్నారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలకు పోలీసులు సహకరిస్తున్నారని మండిపడతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement