తాడిపత్రి డేరా బాబావి.. ఒంగోలులో ఏం పీకుతావు జేసీ!: టీడీపీ నేత ఫైర్‌ | TDP Leader Surya Prakash Reddy Serious On JC Prabhakar Reddy | Sakshi
Sakshi News home page

తాడిపత్రి డేరా బాబావి.. ఒంగోలులో ఏం పీకుతావు జేసీ!: టీడీపీ నేత ఫైర్‌

Oct 5 2025 7:38 AM | Updated on Oct 5 2025 8:25 AM

TDP Leader Surya Prakash Reddy Serious On JC Prabhakar Reddy

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌గా ఉండి ఒంగోలుకు వచ్చి ఏమి పీకుతావు జేసీ ప్రభాకరరెడ్డి’.. అంటూ ఒంగోలుకు చెందిన టీడీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్‌రెడ్డి(Surya Prakash) మండిపడ్డారు. ఒంగోలులోని ఓ స్థలం విషయంలో జేసీ ఫోన్‌చేసి తనను బెదిరించారని శనివారం మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి వెల్లడించారు.

ఆయన ఏమన్నారంటే.. జేసీ ప్రభాకరరెడ్డి(Prabhakar Reddy) శుక్రవారం సాయంత్రం ఫోన్‌చేసి ఒంగోలులోని 148 సర్వే నంబరులోని స్థలం విషయంలో తన మనుషులు వస్తారని, వాళ్లకు ఆ స్థలం అప్ప­గించాలంటూ నన్ను బెదిరించాడు. నీ స్థలంలోకి నా మనుషులు వస్తారు.. నువ్వక్కడ లేకుంటే నీ ఇంటికి వస్తారు. సెటిల్‌ చేసుకో. లేకుంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ నుంచే ఎత్తుకు వస్తారు అని బెదిరించాడు. గలీజు మాటలు, బండ బూతులు, మీడి­యా ముందు చెప్పుకోలేని పదజాలం వాడాడు.  

గడ్డం బాబా మాదిరిగా తాడిపత్రిలో పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తున్న జేసీ ప్రభాకరరెడ్డి ఒక డేరా బాబా మాదిరిగా మారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. జేసీ ప్రభాకర్‌రెడ్డీ.. అనంతపురం జిల్లా­లో, తాడిపత్రిలో చేసినట్లు ఫ్యాక్షన్‌  రాజకీయాలు, బెదిరింపులు ఒంగోలులో చేస్తే చెల్లవు. నువ్వూ టీడీపీ నాయకుడివే. తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌వి. తాడిపత్రిలో ఉన్న మురుగు సంగతి చూసుకో. అక్కడ మురుగు కంపుకొడుతోంది. దానిని కడుక్కోలేని నువ్వు ఒంగోలుకు వచ్చి పీకేది ఏంది? అంటూ ప్రశ్నించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు టీడీపీలో(TDP) కొత్త ట్విస్ట్‌ ఇచ్చాయి. ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement