తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దయవలనే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయిందనే విషయం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైందన్నారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి. కూటమి ప్రభుత్వం రాయలసీమకు ఎంత అన్యాయం చేస్తుందో తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తేటతెల్లమైందని విమర్శించారు.
రేవంత్ రెడ్డి ప్రయోజనాలు కాపాడటం కోసమని రాయలసీమ ప్రజల కళ్లలో కారం కొట్టాడు. చంద్రబాబు రాయలసీమను తాకట్టు పెట్టారు. రేవంత్ రెడ్డికి పన్నీరు, రాయలసీమ కు కన్నీరు. వైఎస్ జగన్ పాలనలో రాయలసీమకు మేలు చేయాలని రూ. 7 వేల కోట్లతో ప్రారంభించారు..చంద్రబాబు రాయలసీమ వాసిగా ఉండి ఏనాడు మేలు చేసింది లేదు..రాయలసీమకు వైఎస్సార్ 1984 - 85 నుంచి ఎంతో మేలు చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక హంద్రీ నీవా, గాలేరు నగరి ప్రాజెక్టులు ద్వారా సస్యశ్యామలం చేశారు. ఆయన వారసుడిగా వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కొనసాగించారు..
టిడిపి చెలికత్తె పత్రిక విషపు రాతలు రాస్తోంది..రాయలసీమ మేధావులు, కర్షకులు, ప్రజలు అందరూ ఉపేక్షించకుండా పోరాటానికి సన్నద్ధం కావాలి’ అని భూమన పిలుపునిచ్చారు.


