నెల్లూరు: జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల ఎంపీపీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటు హక్కు వినియోగానికి వస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేయడానికి యత్నించడంతో కలకలం రేగింది. ఐదుగురు ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న కారును టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలపై టీడీపీ ఎమ్మెల్యే కాకరల్లల వర్గీయులు రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ మలహిళా ఎంపీటీసీ రత్నమ్మకు గాయాలయ్యాయి. మల్లికార్జున్ అనే వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేశారు. మరో ఎంపీటీసి మోహన్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. ఎన్నిక జరిగే ప్రాంతం అయిన ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే అనుచరుల జులం ప్రదర్శించారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.



