అనంతపురం: వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లాలో జూటూరులో వైఎస్సార్‌సీపీ నాయకుడు రామసుబ్బారెడ్డిపై టీడీపీ నేత దాడి చేశారు.

రామసుబ్బారెడ్డిపై టీడీపీకి చెందిన రవికుమార్ కొడవలితో దాడికి దిగాడు. ఈ ఘటనలో రామసుబ్బారెడ్డి గాయపడ్డారు. ఆయన్ని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు..


