
రివాల్వర్ చూపిస్తూ బెదిరిస్తున్న సీఐ సాయిప్రసాద్
తాడిపత్రి సీఐ ఓవరాక్షన్
పెద్దారెడ్డి అనుచరులకు రివాల్వర్‌తో బెదిరింపులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: టీడీపీ నేతల అండతో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సీఐ సాయిప్రసాద్ చెలరేగిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని సొంతింటికి రాగా.. పోలీసులు ఆదివారం ఆయన్ని బలవంతంగా అనంతపురానికి తరలించిన సంగతి తెలిసిందే.
సీఐ సాయిప్రసాద్ పోలీస్ వాహనంలో పెద్దారెడ్డిని తరలిస్తుండగా.. ఆయన అనుచరులు అనుసరించారు. దీంతో సీఐ తన రివాల్వర్ తీసి.. ‘కాల్చేస్తా’ అన్నట్లుగా వారిని బెదిరించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.