జేసీ వర్గీయుల దాష్టీకం.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడి | Jc Supporters Attack Ysrcp Workers Houses In Tadipatri | Sakshi
Sakshi News home page

జేసీ వర్గీయుల దాష్టీకం.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడి

Jun 30 2025 3:28 PM | Updated on Jun 30 2025 3:57 PM

Jc Supporters Attack Ysrcp Workers Houses In Tadipatri

సాక్షి, అనంతపురం జిల్లా: రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు ఆగడం లేదు. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు దాష్టీకానికి దిగారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రామకృష్ణ, రేవతి ఇళ్లపై దాడి చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త రామకృష్ణ కిరాణా షాపును జేసీ వర్గీయులు ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మద్దతు ఇవ్వొద్దని  జేసీ నిన్న వార్నింగ్ ఇచ్చారు. మద్దతు ఇచ్చిన వారిపై జేసీ వర్గీయులు దాడులకు తెగబడ్డారు.

కాగా, ఆదివారం తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసిన తర్వాత టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘ఈ రోజు నీ దగ్గరకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను రప్పా.. రప్పాలాడిస్తాం. చేతనైతే కాపాడుకో కేతిరెడ్డీ’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట ఎవరెవరు వచ్చారో వారి జాబితా, ఫొటోలు తనవద్ద ఉన్నాయని, వారిని ఇకపై టీడీపీ కార్యకర్తలు రప్పా.. రప్పాలాడిస్తారని అన్నారు. తాడిపత్రిలో­ని వైఎస్సార్‌సీపీ వాళ్లు శత్రువులు కాదంటూనే ఈ వ్యాఖ్యలు చేశా­రు.  ‘ఈ రోజు మా వాళ్లను గట్టిగా పట్టుకుని కూర్చున్నా. రేపటి నుంచి నేను ఊళ్లో ఉండను. ఓ వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్త చాలా మాట్లాడుతోంది. మా మహిళా కార్యకర్తలూ ఉన్నారు.’ అంటూ జేసీ వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement