పచ్చ బిళ్ల ఉంటే కేసులు నమోదు చేయడం లేదు: పేర్ని నాని | Perni Nani Alliance Rule Criticized Breakdown of Law and Order | Sakshi
Sakshi News home page

పచ్చ బిళ్ల ఉంటే కేసులు నమోదు చేయడం లేదు: పేర్ని నాని

Jul 20 2026 3:45 PM | Updated on Jul 20 2026 4:31 PM

Perni Nani Alliance Rule Criticized Breakdown of Law and Order

తాడేపల్లి: టీడీపీ నేతల కనుసన్నల్లో పోలీస్‌ వ్యవస్థ నడుస్తోందని ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గుంటూరు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో పోలీస్‌ వ్యవస్థను నీరుగారుస్తూనే ఉన్నారని తెలిపారు.

‘‘కూటమి పాలనలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమైంది. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఈవీఎం ద్వారా వచ్చిన అధికారంతో పోలీస్‌ వ్యవస్థను అండగా పెట్టుకున్నారు. పచ్చ బిళ‍్ల ద్వారా నేరాలు-ఘోరాలకు అధికారిక గుర్తింపు ఇస్తున్నారు. రేప్‌ చేసిన వాడి జేబులో పచ్చ బిళ్ల ఉంటే కేసులు నమోదు చేయడం లేదు. భారత రాజ్యాంగం కంటే రెడ్‌బుక్కే పోలీసులకు ముఖ్యమైంది. టీడీపీ నేతలు వద్దంటే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ కూడా రాయడం లేదు.

బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు వస్తే పోలీసులు కనీసం వారి మొర వినడం లేదు. కేసు నమోదు చేయాలన్నా టీడీపీ ఎమ్మెల్యే ఫోన్‌ చేయాలట. బీఎన్‌ఎస్‌ కంటే కూడా చంద్రబాబు సెక్షన్‌, లోకేశ్‌ సెక్షనే పోలీసులకు ముఖ్యమా? ఒక మహిళ పోలీస్‌ స్టేషన్‌ గడప తొక్కిందంటే ఎంత ఆవేదన చెంది ఉంటుంది? హోంమంత్రి మాట కూడా మాట్లాడడం లేదు. పోలీసులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వృత్తిని పణంగా పెడుతున్నారు. పోలీస్‌ వ్యవస్థను చేతిలో పెట్టుకుని రాష్ట్రంలో పరిస్థితులను దిగజార్చారు.

జేబులో పచ్చ బిల్లేసుకుని టీడీపీ రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement