విజయవాడ: ఓ యువతిపై జిమ్ ట్రైనర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసి, నగ్న ఫొటోలు తీసినట్లు బాధిత యువతి ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుతో జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్‌పై కేసు నమోదు చేసిన సత్య నారాయణపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాధిత యువతి ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పని చేస్తోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ పరిచయమయ్యాడు. లావుగా ఉన్న టీచర్ స్లిమ్‌గా అయ్యేందుకు జిమ్ సలహాలు ఇస్తూ పరిచయం పెంచుకున్నాడు.
ఆమెను ప్రైవేట్ హోటల్‌కు తీసుకువెళ్లి బరువు తగ్గడానికి షేక్ తాగాలంటూ అందులో మత్తు మందు కలిపి ఇచ్చాడని ఆ టీచర్ తెలిపింది. మత్తు ఇచ్చి అత్యాచారం చేశాడని పోలీసులను ఆశ్రయించిన యువతి. కేసు నమోదు చేసి యువతిని పోలీసులు వైద్య పరీక్షల కోసం తరలించారు. జిమ్ ట్రైనర్ ఖాదర్ పరారీలో ఉన్నాడు.


