దర్యాప్తు జరిపించాలన్న ప్రతిపక్షాలు
అగర్తలా: త్రిపుర డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) అనురాగ్ ఠాకూర్(60) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం ఉదయం అగర్తలాలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలోని తన సొంత ఆఫీసు ఛాంబర్ బాత్‌రూంలో ఉరేసుకుని బలవన్మరణం చెందారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మాణిక్ సాహా ప్రకటించారు. ఠాకూర్ మరణ వార్త విని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జేకే సిన్హా,, ఆరోగ్య శాఖ కార్యదర్శి కిరణ్ గిట్టె తదితరులు ఆస్పత్రికి వెళ్లారని ఆయన తెలిపారు. అనురాగ్ ఠాకూర్ మృతిపై సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
‘మధ్యాహ్నం 12 గంటలకు డీజీపీ అనురాగ్ ఠాకూర్‌ను ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే చనిపోయినట్లు 12.48 గంటలకు ప్రకటించారు’అని గోవింద్ వల్లభ్ పంత్ ఆస్పత్రి మెడిసిన్ డిపార్ట్‌మెంట్ చీఫ్ డాక్టర్ ప్రదీప్ భౌమిక్ వివరించారు. పోస్టుమార్టం అనంతరమే ఠాకూర్ మృతికి దారి తీసిన కారణాలు వెల్లడవుతాయని తెలిపారు. 1994 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన అనురాగ్ ఠాకూర్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. మేలో డీజీపీగా నియమితులైన ఠాకూర్ మరో 11 నెలల్లో రిటైరవ్వాల్సి ఉంది.
#BreakingNews | #Tripura Director General of Police (DGP) Anurag Dhankar was found dead at his office at the Police Headquarters in Agartala on Monday.
Preliminary reports suggest that the senior IPS officer allegedly died by suicide. However, the exact circumstances surrounding… pic.twitter.com/ks4KYnOB6Z— NORTHEAST TODAY (@NortheastToday) July 20, 2026
కాగా, రాష్ట్ర పోలీస్ చీఫ్ ఆఫీసులోనే చనిపోవడంపై ప్రతిపక్ష నేత జితేంద్ర చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. ఏకంగా సీనియర్ ఐపీఎస్ ఆత్మహత్య పాల్పడటాన్ని చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏమిటో తెలుస్తుంది. ఆయన తీవ్ర ఒత్తిడులకు గురయ్యారు. అవేంటో వెల్లడికావాలి. ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో జ్యుడీషియల్ దర్యాప్తు జరిపించాలి. మృతికి కారణాలను వెల్లడించాలి’అని జితేంద్ర చౌదరి డిమాండ్ చేశారు. డీజీపీ అనురాగ్ ఠాకూర్ మరణంపై మెజిస్టీరియల్ దర్యాప్తు జరుగుతోందని, నిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయని బీజేపీ రాష్ట్ర చీఫ్ అభిõÙక్ దేబ్‌రాయ్ తెలిపారు.


