కర్నూలు: అధికారం ఉందనే అండతో సామాన్యుల జీవితాలతో ఆడేసుకుంటోంది కూటమి సర్కారు. సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లలో భాగంగా కర్నూలు జిల్లా ఆస్పరిలో అధికారులు అతి ఉత్సాహం ప్రదర్శించారు. రైతు అనుమతి లేకుండా జొన్న పంటను జేసీబీతో దున్నేశారు అధికారులు. పశువులకు మేత లేకుండా చేసేశారు. దాంతో ఆ పొలానికి సంబంధించి రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు.
పశువులకు మేత లేకుండా చేస్తారా అంటూ అధికారులపై ఆగ్రహవ వ్యక్తం చేశాడు. వీఐపీ పార్కింగ్ కోసమని తన పొంట పొలాన్ని దున్నేస్తారా అంటూ మండిపడ్డాడు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, వేసిన పంటకు డబ్బులు ఇవ్వకుండా పంటను ఎలా దున్నుతారు ఆవేదన చెందుతున్నాడు.
ఇది పశువుల కోసం వేసుకున్న పంట అయ్యా.. దీన్ని ఇలా దున్నేస్తారా అయ్యా అంటూ గుండె బరువెక్కెలా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు తన పశువులకు మేత ఎలా అంటూ చెమర్చిన కళ్లతో దున్నేసిన పొలాన్ని చూసుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.


