
డీపీవోపై బూతులతో రెచ్చిపోయిన జేసీ వీడియో సోషల్ మీడియాలో వైరల్
తాడిపత్రి టౌన్: ‘ఏందిరా నీ ఓవరాక్షన్ .. నువ్వేం పీకలేవు రా.. రేయ్’ అంటూ మూడు రోజుల క్రితం అనంతపురం నగరంలోని జెడ్పీ కార్యాలయం వద్ద జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) నాగరాజు నాయుడుపై తాడిపత్రి మునిసిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి బూతులతో రెచ్చిపోయిన విషయం విదితమే. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘జేసీ రౌడీయిజం.. రెడ్‌బుక్ పాలన’ శీర్షికతో ఆ వీడియోను ప్రజాస్వామ్యవాదులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఖండిస్తున్నారు. డీపీవో నాగరాజు నాయుడును ఉద్దేశించి...‘రేయ్ వాణ్ని పట్టుకో’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులను పురమాయించడం వీడియోలో ఉంది. ‘రేయ్ మర్యాద ఇచి్చన.. నువ్వు నోరు మూసుకో.. మూసుకో నా కొడకా.. లంచం దెం.. ఎప్పుడురా జాయింట్ కలెక్టర్ నీకిచి్చంది’ అనగానే డీపీవో నాగరాజు నాయుడు జేసీ వైపు చూశారు. దీంతో జేసీ ప్రభాకర్.. ‘ఏం అట్ల చూస్తావ్?! పీకలేవు రా రేయ్’ అంటూ దుర్భాషలాడుతూ కొట్టేవిధంగా డీపీవో మీదకు వెళ్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డిని అనుచరుడు పొట్టి రవి అడ్డుకోవడం కనిపించింది.