‘తాడిపత్రిలో ఆటవిక రాజ్యం.. పోలీసులు అడ్డుకోవడమేంటి?’ | YSRCP Anantha Venkatarami Reddy Serious On CBN Govt | Sakshi
Sakshi News home page

‘తాడిపత్రిలో ఆటవిక రాజ్యం.. పోలీసులు అడ్డుకోవడమేంటి?’

Jun 29 2025 12:13 PM | Updated on Jun 29 2025 12:59 PM

YSRCP Anantha Venkatarami Reddy Serious On CBN Govt

సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. తాడిపత్రి వెళ్లిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరి మారకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అని హెచ్చరించారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు వచ్చి రెండు మాసాలైనా పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. ఈరోజు ఉదయం తాడిపత్రి వెళ్లిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం.  పోలీసులు రాజ్యాంగ బద్దంగా వ్యవహరించటం లేదు.

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లొద్దని ఏవైనా ఆదేశాలు ఉన్నాయా?. మాజీ ఎమ్మెల్యేని తాడిపత్రిలోకి అనుమతించకపోవడం ఏం న్యాయం?. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం దుర్మార్గం. పోలీసుల వైఖరి మారకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం’ అని చెప్పుకొచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement