
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రావడానికి సుప్రీంకోర్టు అనుమతించి.. భద్రతా కల్పించాలని పోలీసులను ఆదేశించినా పోలీసులు మాత్రం ఇంకా తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు.. స్థానిక ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి ఎన్ని అడ్డంకులు కల్పించినా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన పంతం వీడక సుప్రీం కోర్టు వరకూ వెళ్లి పోరాడి తన హక్కులు సాధించుకున్నారు.. ఎలాగైనా సరే భీష్మించుకుని తాడిపత్రిలో అడుగుపెట్టారు.. అయితే ఇప్పుడు మళ్ళీ పోలీసులు కొత్త రాగం తీస్తున్నారు.
వాస్తవానికి గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన తాడిపత్రిలో అడుగిడేందుకు ఆయనకు దాదాపు 15 నెలల సమయం పట్టింది.. పెద్దారెడ్డి తాడిపత్రి ఎలా వస్తాడో. ఎలా తిరిగివెళ్లాడో చూస్తాను అంటూ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన హెచ్చరికలు ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు రేపగా ఆయన్ను తాడిపత్రి రావద్దని పోలీసులు కూడా సూచించారు. దీనిమీద అయన హైకోర్టుకు వెళ్లారు.. అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లే వచ్చి మళ్ళీ అడ్డంకులు వచ్చాయి. దీంతో అయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడ ఆయనకు పూర్తి సానుకూలమైన తీర్పు వచ్చింది.
అయన సొంత నియోజకవర్గానికి వెళ్ళడానికి ఎవరు అడ్డంకి.. వెళ్లనీయండి.. కాకుంటే ఆయనకు భారీ భద్రతా కల్పిస్తూ పోలీసుల సమక్షంలో ఆ పర్యటన జరగాలి.. ఆ భద్రతకు అయ్యే ఖర్చు మొత్తం పెద్దారెడ్డి భరించాలి అని కోర్టు చెప్పింది.. దీంతో ఇక పోలీసులు.. ఏపీ ప్రభుత్వం కూడా అయన రాకను అడ్డుకోలేని పరిస్థితి వచ్చింది.
దీంతో అయన సెప్టెంబర్ ఆరున తాడిపత్రి వెళ్లారు.. దీనికి భారీ భద్రత కల్పించారు.. అయితే అంతలోనే మళ్ళీ పోలీసులు ఆయన్ను నియంత్రిస్తున్నారు.. మీరు పదోతేదీన ఇక్కడ ఉక్కడ ఉండకూడదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నారు కాబట్టి.. మేమంతా అయన భద్రతా చర్యల్లో ఉంటాం.. మీకు సరైన భద్రత కల్పించలేం.. మళ్ళీ జరగరానిది జరిగితే మీకు మాకు కూడా ఇబ్బంది.. ఎందుకొచ్చిన గొడవ.. ఆ తరువాత మీరు రావచ్చు.. ఇప్పుడైతే మీ సొంత ఊరు వెళ్లిపోండి.. తరువాత వద్దురుగాని అని చెబుతున్నారు.. చంద్రబాబు పర్యటన సమయంలో వైఎస్సార్‌సీపీ అభిమానులు.. పెద్దారెడ్డి అనుచరులు ఏమైనా హడావుడి చేస్తే ప్రభుత్వానికి చికాకు కదా జాగ్రత్తతో ఇలా చెబుతున్నారని తెలుస్తోంది.. చంద్రబాబు భద్రతకు మూణ్ణాలుగు జిల్లాల నుంచి పోలీసులను రప్పించే ప్రభుత్వం పెద్దారెడ్డికి మాత్రమే రక్షణ కల్పించలేకపోవడం చేతగాని రాజకీయం అని అయన అభిమానులు అంటున్నారు.
::సిమ్మాదిరప్పన్న