విజయవాడ అమరావతి కోసం మళ్లీ అప్పు చేయడానికి సిద్ధమైంది చంద్రబాబు ప్రభుత్వం. నాబార్డ్ ద్వారా రూ. 7,387 కోట్లు అప్పు చేసింది. APCRDAకి నాబార్డ్ రుణం రూ.7,387.70 కోట్లు పొందేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. అమరావతి కోసం ఇప్పటికే 40 వేల కోట్లకు పైగా అప్పు తెచ్చిన ప్రభుత్వం.. తాజాగా మరో అప్పుకు సిద్ధమైంది. తాజా రుణంతో కలిసి అమరావతి కోసం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అప్పు రూ. 47 వేల కోట్లను దాటనుంది.


