సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు జేసీ, ఆయన అనుచరులు తాడిపత్రిలో పెద్ద స్కెచ్ వేశారు. తాడిపత్రిలో ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం పేక్షక పాత్ర పోషించడం గమనార్హం.
తాడిపత్రి నియోజకవర్గంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. అధికార కూటమికి సవాల్ విసిరారు. తాడిపత్రిలో 30 ఏళ్ల జేసీ పాలనకు, ఐదేళ్ల తన పాలనపై చర్చకు రెడీ అని చెప్పుకొచ్చారు. అయితే, కేతిరెడ్డి సవాల్‌కు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కానీ, కేతిరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగారు. రేపు(శుక్రవారం) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసేందుకు టీడీపీ నేతల జనసమీకరణ చేశారు.
ఇందులో భాగంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు స్కెచ్ రచిస్తున్నట్టు తెలిసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో జేసీ వర్గీయులు ప్రత్యేక లారీల్లో రాళ్లు తీసుకొచ్చి.. కేతిరెడ్డి ఇంటి వద్ద పోశారు. దాడి చేసేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద కంకర రాళ్లు సిద్ధం చేసుకున్నారు. దీనిపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.


