తాడిపత్రి పీఎస్‌ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి ఓవరాక్షన్‌ | JC Prabhakar Reddy High Drama at Tadipatri PS | Sakshi
Sakshi News home page

తాడిపత్రి పీఎస్‌ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి ఓవరాక్షన్‌

Jun 12 2026 6:04 PM | Updated on Jun 12 2026 6:54 PM

JC Prabhakar Reddy High Drama at Tadipatri PS

అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత  జేసీ ప్రభాకర్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు.  వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై అక్రమ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రి పీఎస్‌ వద్ద స్నానం చేస్తూ హైడ్రామా నెలకొల్పారు. తాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వేచ్ఛ గా పర్యటించవచ్చని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ,.. ఆ ఆదేశాలు అమలు కాకుండా జేసీ ప్రభాకర్‌రెడ్డి కుట్రలకు తెరలేపారు. 

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దౌర్జన్యం చేశారని.. కేసులు నమోదు చేయాలని తాను అనుచరుల ద్వారా తప్పుడు ఫిర్యాదులు చేయించారు ప్రభాకర్‌రెడ్డి. ఆ ఫిర్యాదులు ఆధారంగా కేసులు నమోదు చేయాలని తాడిపత్రి పీఎస్ వద్ద ఓవకాక్షన్‌ చేశారు.. నడిరోడ్డుపై స్నానం చేసి పోలీసులపై ఆరోపణలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఒత్తిడితో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై కేసు నమోదు చేశారు పోలీసులు.

 

పోలీస్ స్టేషన్ ముందు జేసీ ఓవర్ యాక్షన్ నడ్డి రోడ్డుపై స్నానం

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement