తిరుపతి: జిల్లాలోని రామచంద్రాపురం మండలం రాయలచెరువులో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పొలంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి దగ్గర తగాదాతో సుబ్రహ్మణ్యంపై హరి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
దాంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వచ్చిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డటమే ఆందోళన రేకెత్తిస్తోంది. స్టేషన్‌లో సుబ్రహ్మణ్యంపై పోలీసులే దాడి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల వైఖరి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


