
న్యూఢిల్లీ: దేశంలోని పలు రైల్వే డివిజన్లలో ట్రాక్ నిర్వహణ, సాంకేతిక నవీకరణ పనులు కొనసాగుతున్నందున జార్ఖండ్ గుండా వెళ్లే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయనున్నట్లు భారతీయ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. చక్రధర్‌పూర్ డివిజన్‌లో జరుగుతున్న పనులు రైలు సేవలకు అంతరాయం కలిగిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ప్రయాణాలకు సిద్ధమవుతున్నవారు రద్దవుతున్న రైళ్ల వివరాలను, తేదీలను తెలుసుకోవడం ద్వారా అందుకు అనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోగలుగుతారు. ఈ రైళ్ల రద్దు ప్రభావం చర్లపల్లి, హైదరాబాద్, విశాఖపట్టణంలో కనిపించనుంది.
చర్లపల్లి, హైదరాబాద్, విశాఖలలో రద్దయ్యే రైళ్లివే..
రైలు నం. 17007 చర్లపల్లి - దర్భంగా ఎక్స్‌ప్రెస్ (వయా రాంచీ ) 2025, ఆగస్టు 26, సెప్టెంబర్ 9 తేదీలలో రాకపోకలు సాగించదు.
రైలు నం. 17008 దర్భంగా - చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ (వయా రాంచీ) 2025 ఆగస్టు 29, సెప్టెంబర్ 12 తేదీలలో రద్దు కానుంది.
రైలు నం. 18523 విశాఖపట్నం - బనారస్ ఎక్స్‌ప్రెస్ (వయా రాంచీ) 2025, ఆగస్టు 27, 31, సెప్టెంబరు 7, 10 తేదీలలో రాకపోకలు సాగించదు.
రైలు నం. 18524 బనారస్ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (వయా రాంచీ) 2025, ఆగస్టు 28, సెప్టెంబర్ 1,8, 11 తేదీలలో రద్దు చేయనున్నారు.
రైలు నం. 17005 హైదరాబాద్ - రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ (వయా రాంచీ) 2025, ఆగస్టు 28న రద్దు కానుంది.
రైలు నం. 17006 రక్సౌల్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ (వయా రాంచీ) 2025, ఆగస్టు 31న నడవదు.
రైలు నం. 07051 చర్లపల్లి - రక్సౌల్ స్పెషల్ (వయా రాంచీ) 2025, ఆగస్టు 30న నడవదు.
రైలు నం. 07052 రక్సౌల్ - చర్లపల్లి స్పెషల్ (వయా రాంచీ) 2025, సెప్టెంబర్ 2న నడవదు.
రైలు నం. 07005 చర్లపల్లి - రక్సౌల్ స్పెషల్ (వయా రాంచీ) 2025, సెప్టెంబర్ 1న రద్దు కానుంది.
రైలు నం. 07006 రక్సౌల్ - చర్లపల్లి స్పెషల్ (వయా రాంచీ) 2025, సెప్టెంబర్ 4న రద్దు చేయనున్నారు.