ఉత్తరాదికి శ్రావణ శోభ.. ఆకట్టుకుంటున్న వీడియోలు | Devotees Throng Temples First Monday of Sawan | Sakshi
Sakshi News home page

ఉత్తరాదికి శ్రావణ శోభ.. ఆకట్టుకుంటున్న వీడియోలు

Jul 14 2025 12:10 PM | Updated on Jul 14 2025 12:29 PM

Devotees Throng Temples First Monday of Sawan

న్యూఢిల్లీ: నేడు దేశంలోని ఉత్తరాదిన తొలి శ్రావణ సోమవారం. ఎంతో పవిత్రమైనదిగా భావించే ఈరోజున వివిధ దేవాలయాల ముందు వేలాది మంది భక్తులు క్యూ కట్టారు. ఉత్తరాదిన శ్రావణ మాసం జూలై 11న ప్రారంభమై, ఆగస్టు 9న ముగుస్తుంది. ఇది హిందూ చంద్రమాన క్యాలెండర్‌లో ఐదవ నెల. శివునికి ఎంతో ప్రతీకరమైన మాసంగా శ్రావణమాసం గుర్తింపు పొందింది.
 

శ్రావణ సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో భద్రతను మరింతగా పెంచారు. యాత్రికుల రద్దీని తట్టుకునేందుకు నిర్వాహకులు నెల రోజులు ముందు నుండే సన్నాహాలు  చేస్తున్నారని వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ తెలిపారు.

కన్వరియాల కోసం, ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్ నుండి వచ్చే భక్తుల కోసం ఒక ప్రత్యేక లైన్‌ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.  ఆలయ ప్రాంగణం సీసీటీవీ నిఘాలో ఉంది. సమీప ప్రాంతాలను పర్యవేక్షించేందుకు డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు. భక్తులను క్రమబద్ధీకరించేందుకు బారికేడ్లను ఏర్పాటు చేశారు.

12 జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వనాథుని ఆలయంలో భక్తులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో ఉదయం వేళ భస్మ హారతి నిర్వహించారు. ముందుగా మహాకాళునికి నీటితో స్నానం చేయించారు. తరువాత పాలు, పెరుగు, నెయ్యి, తేనె పండ్లతో ‘పంచామృత అభిషేకం’ చేశారు.  అనంతరం స్వామివారికి విభూతి సమర్పించారు. ఆ సమయంలో శంఖునాదాలు, గంటల శబ్దాలతో ఆలయం ప్రతిధ్వనించింది.

యూపీలోని పరశురామేశ్వర్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఘజియాబాద్‌లోని దూధేశ్వర్ మహాదేవ్ ఆలయం, ఢిల్లీలోని గౌరీ శంకర్ ఆలయం, శ్యామ్ నాథ్ ఆలయం, లక్నోలోని మంకమేశ్వర్ ఆలయం, అయోధ్యలోని క్షీరేశ్వర్ నాథ్ ఆలయం, దేవఘర్‌లోని బైద్యనాథ్ ఆలయం  భక్తులతో కిటకిటలాడుతున్నాయి.  గౌహతిలోని సుక్రేశ్వర్ ఆలయం, ముంబైలోని బాబుల్నాథ్ ఆలయం భారీ జనసమూహంతో నిండిపోయాయి. మీరట్‌లోని కాళీ పల్తాన్ ఆలయం, సనాతన ధర్మ ఆలయం, దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం, గ్వాలియర్‌లోని అచలేశ్వర్ ఆలయం భక్తులతో కళకళలాడుతున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement