
ఆసియా దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం
దుబాయ్: ఎర్ర సముద్రం అడుగున్న కేబుళ్లు తెగడంతో భారత్ సహా పలు ఆసియా దేశాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. సౌదీ అరేబియాలోని జెడ్డా సమీపంలో ఎస్‌ఎండబ్ల్యూ4, ఐఎంఈడబ్లూఈ కేబుల్ వ్యవస్థలు స్తంభించాయని ఇంటర్నెట్ పర్యవేక్షక సంస్థ నెట్‌బ్లాక్స్ తెలిపింది.
గాజా యుద్ధాన్ని ఆపేసేలా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకే కేబుళ్లకు నష్టం కలిగించి ఉండొచ్చంటున్నారు. ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, పశ్చిమ ఐరోపా4 కేబుల్‌ను టాటా కమ్యూనికేషన్స్.. భారత్, పశ్చిమాసియా, పశ్చిమ యూరప్ కేబుళ్లను అల్కాటెల్ లూసెంట్ నిర్వహిసతఉన్నాయి. ఈ పరిణామంపై సౌదీ మౌనం వహించగా, నెట్ వేగం తగ్గిందని యూఈఏ తెలిపింది.