సౌదీ అరేబియా మదీనా సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో 45 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు సజీవ దహనమైన తెలిసిందే. మృతుల్లో అత్యధికంగా తెలంగాణ హైదరాబాద్‌కు చెందినవాళ్లే ఉన్నారు. అయితే హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ షోయబ్ అనే యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదం నుంచి బయటపడిన ఏకైక వ్యక్తి అతనే.
అతను ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగిన బస్సు డ్రైవర్‌తో పాటు అతను బయటపడ్డాడు,. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో అతను కిందకు పడిపోవడంతోనే అతను సురక్షితంగా బయటపడ్డాడు. ఐసీయూలో చికిత్స పొందుతున్న షోయబ్.. ఇంకా షాక్‌లోనే ఉన్నాడు. బస్సు ప్రమాదం జరిగి అగ్ని గోళంగా మారిపోవడంతో ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. తన కళ్లు ముందు బస్సు అగ్ని ఆహుతి కావడంతో అలా చూస్తూ ఉండిపోయాడు తప్ప చేసేదేమీ లేకుండా పోయింది.
హైదరాబాద్ అసిఫ్ నగర్, హబీబ్ నగర్‌కు చెందిన 44 మంది మక్కా యాత్ర కోసం అల్ మక్కా, ఫ్లై జోన్ ట్రావెల్స్ నుంచి టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ నెల 9వ తేదీన వాళ్లు అక్కడికి వెళ్లారు. మొత్తం 46 మంది ప్రయాణికులతో కూడిన బస్సు మక్కా యాత్ర తర్వాత గత రాత్రి మదీనాకు వెళ్తోంది. వాళ్లు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టింది.
ఈ ఘోర ప్రమాదంలో 45 మంది మరణించగా.. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన వాళ్లే 16 మంది ఉన్నారు. అయితే మృతుల్లో నగరానికి రెండు కుటుంబాలకు చెందిన 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఒక కుటుంబంలో 8 మంది, మరో కుటుంబంలో ఏడుగురు ప్రమాదంలో సజీవ దహనం అయ్యారు.


