దిరియాపై  దేశీ దిగ్గజాల కన్ను | Saudi Arabia Diriyah Lures In Indian Investors Including Tata And Oberoi Groups | Sakshi
Sakshi News home page

దిరియాపై  దేశీ దిగ్గజాల కన్ను

Feb 10 2025 6:41 AM | Updated on Feb 10 2025 6:41 AM

Saudi Arabia Diriyah Lures In Indian Investors Including Tata And Oberoi Groups

సౌదీ అరేబియా గిగా ప్రాజెక్ట్‌ 

63 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు 

టాటా, ఒబెరాయ్‌ గ్రూప్‌ ఆసక్తి

న్యూఢిల్లీ/దావోస్‌: సౌదీ అరేబియాలో దిరియా పేరుతో తలపెట్టిన అతిభారీ(గిగా) టూరిజం ప్రాజెక్టుపై దేశీ కార్పొరేట్‌ దిగ్గజ గ్రూప్‌లు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 63 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో రూపొందనున్న ఈ ప్రాజెక్టులో దేశీ దిగ్గజాలు టాటా గ్రూప్, ఒబెరాయ్‌ గ్రూప్‌ తదితరాలు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు దిరియా సీఈవో జెర్రీ ఇన్‌జెరిల్లో పేర్కొన్నారు. 

సిటీ ఆఫ్‌ ఎర్త్‌గా పేర్కొంటున్న ఈ ప్రాజెక్టును సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ చివర్లో నెలకొల్పుతున్నారు. లక్ష మంది ప్రజలకు గృహాలు, మరో లక్ష మందికి కార్యాలయ ప్రాంతాలతో ప్రాజెక్టు రూపొందనుంది. ఈ కొత్త నగరం 40 విలాసవంత హోటళ్లు, 1,000కుపైగా షాపులు, 150 రెస్టారెంట్లు, 20,000 సీట్ల సామర్థ్యంగల మలీ్టపర్పస్‌ ఈవెంట్లకు వీలయ్యే ఒపేరా హౌస్‌సహా గోల్ఫ్‌ కోర్స్, కేఫ్‌లు, యూనివర్శిటీలు, కల్చరల్‌ అసెట్స్, మ్యూజియంలు తదితరాలతో ఏర్పాటుకానుంది.  

Advertisement
 
Advertisement
Advertisement