 
							ప్రపంచంలోనే అమెరికా, చైనా, రష్యా అత్యంత శక్తివంతమైన దేశాలుగా పరిగణించబడుతున్నాయి. ఆర్థిక, సైనిక, రాజకీయ ప్రభావాల ఆధారంగా ర్యాంక్ ఇస్తున్నారు. 2025 లెక్కల ప్రకారం.. ఈ పది దేశాలు లిస్టులో ఉన్నాయి.
 
							అమెరికా : ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మరియు బలమైన సైనిక శక్తిగా ఉంది. రాజకీయ, సాంస్కృతిక ప్రభావం కూడా ఉంది.
 
							చైనా : ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. సైనిక బలాన్ని పెంచుకుంటోంది. ప్రపంచ వేదికపై శక్తిగా ఎదుగుతోంది.
 
							రష్యా : సహజ వనరులు, సైనిక బలం కలిగి ఉంది. ప్రపంచ రాజకీయాలలో రష్యా ప్రభావం కొనసాగుతోంది.
 
							యునైటెడ్ కింగ్‌డమ్ : ఒక ముఖ్యమైన ఆర్థిక, సైనిక శక్తిగా కొనసాగుతోంది. అంతర్జాతీయ సంబంధాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
 
							జర్మనీ : ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ, వ్యూహాత్మక భౌగోళిక స్థానంతో, ఐరోపాలో ముఖ్యమైన దేశంగా ఎదిగింది.
 
							దక్షిణ కొరియా : సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశం. ఆర్థికంగా బలంగా ఉంది.
 
							ఫ్రాన్స్ : ఆర్థికంగా, సైనికపరంగా శక్తివంతమైన దేశం. ఐరోపాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
 
							జపాన్ : సాంకేతికతలో అభివృద్ధి చెందిన దేశం. ఆర్థికంగా బలంగా ఉంది.
 
							ఇండియా : వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. భారీ సైనిక బలం కలిగిన దేశం. ప్రపంచ వేదికపై మరింత శక్తివంతంగా ఉంది.
 
							బ్రెజిల్ : లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది.

 
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
