Neymar completes €100m transfer from PSG to Saudi club Al-Hilal - Sakshi
Sakshi News home page

నెమార్‌కు బంపరాఫర్‌.. ఏకంగా 832 కోట్లు

Aug 17 2023 7:08 AM | Updated on Aug 17 2023 8:25 AM

Neymar completes transfer from PSG to Saudi club Al Hilal - Sakshi

రియాద్‌: ప్రపంచ స్టార్‌ ఫుట్‌బాల్‌ ఆటగాళ్ల కోసం కోట్లాది డాలర్లతో సౌదీ అరేబియా క్లబ్‌లు క్యూ కడుతున్నాయి. ఎంత భారీ మొత్తమైనా చెల్లించి సొంతం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్రిస్టియానో రొనాల్డో (అల్‌ నాసర్‌) ఇక్కడి లీగ్‌లో ఆడుతుండగా ఇప్పుడు మరో టాప్‌ ప్లేయర్‌ నెమార్‌ ఈ జాబితాలో చేరాడు. ఈ బ్రెజిల్‌ ఆటగాడితో తాజాగా సౌదీ క్లబ్‌ ‘అల్‌ హిలాల్‌’ ఒప్పందం కుదుర్చుకుంది.

ఇందు కోసం నెమార్‌కు వార్షిక వేతనంగా 100 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 832 కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం. దీంతో పాటు ఇతర సౌకర్యాలూ నెమార్‌కు లభిస్తాయి. గత ఆరు సీజన్లుగా పారిస్‌ సెయింట్‌ జర్మయిన్‌ (పీఎస్‌జీ) క్లబ్‌ తరఫున  నెమార్‌ ఆడాడు.

తాజా పరిణామాల్లో భాగంగా ట్రాన్స్‌ఫర్‌ ఫీ కింద పీఎస్‌జీ క్లబ్‌కు అల్‌ హిల్‌ మరో 98 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 819 కోట్లు) కూడా చెల్లించనుంది. గాయాలతో ఇబ్బంది పడుతూ గత కొంత కాలంగా ఫామ్‌ కోల్పోయిన నెమార్‌కు ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు అల్‌ హిలాల్‌ ముందుకు రావడం విశేషం.
చదవండిODI WC 2023: ఇలా ఉంటే ఇంగ్లండ్‌ను ఆపడం సాధ్యమా..? వీళ్లు చాలదన్నట్లు స్టోక్స్‌ జతకలిశాడు..!

Advertisement
 
Advertisement
Advertisement