మీరు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోండి.. సౌదీ అరేబియా

Saudi Arabia Urges Its Citizens To Quickly Leave Lebanon - Sakshi

బీరుట్: లెబనాన్‌లోని శరణార్ధుల శిబిరంలో అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న కువైటీలు వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది సౌదీ ఎంబసీ.

సౌదీ అరేబియా తన పౌరులను త్వరగా లెబనాన్ విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరింది. ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు లెబనాన్‌లోని సౌదీ రాయబార కార్యాలయం ట్విటర్లో పిలుపునిచ్చింది. ఈ సందర్బంగా సౌదీకి లెబనాన్ కు మధ్య  రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 

సౌదీ ఎంబసీ తమ దేశస్తులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది కానీ ఎక్కడ సురక్షితమో చెప్పలేదు. ఇదిలా ఉండగా  ఇదే నెల మొదల్లో ఇంగ్లాండ్ మాత్రం లెబనాన్ రాకపోకలపై ఆంక్షలు విధించింది. 

జూలై 29న లెబనాన్ రక్షణ బలగాలకు కరడుగట్టిన ఇస్లామిస్టులకు మధ్య జరిగిన ఘర్షణలో 13 మంది మృతి చెందగా వారంతా మిలిటెంట్లేనని ధృవీకరించాయి శిబిరంలోని భద్రతా వర్గాలు. ఈ శిబిరం అన్నిటిలోకి పెద్దదని ఇక్కడ సుమారు  80,000 నుండి 250,000 మంది పాలస్తీనా శరణార్థులు ఆశ్రయం పొందుతున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. 

ఇది కూడా చదవండి: పబ్జీ లవ్‌స్టోరీ: పాకిస్థాన్‌లో నిన్ను ప్రేమించేవాడే దొరకలేదా?    

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top