భారత్‌ దాడి చేస్తే..  సౌదీ మాకు  అండగా వస్తుంది  | Saudi Arabia will defend Pakistan in the event of India declaring war on its neighbour | Sakshi
Sakshi News home page

భారత్‌ దాడి చేస్తే..  సౌదీ మాకు  అండగా వస్తుంది 

Sep 21 2025 5:25 AM | Updated on Sep 21 2025 5:25 AM

Saudi Arabia will defend Pakistan in the event of India declaring war on its neighbour

పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా వెల్లడి 

న్యూఢిల్లీ: సౌదీ అరేబియాతో చేసుకున్న రక్షణ ఒప్పందం ఫలితంగా భారత్‌ తమపై దాడి చేసిన పక్షంలో ఆ దేశం రంగంలోకి దిగుతుందని పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు. ‘ఈ ఒప్పందం ఏ ఒక్క దేశాన్నో లక్ష్యంగా చేసుకున్నది కాదు. ఉమ్మడి రక్షణకు కుదిరిన అంగీకారం. దురాక్రమణ కోసం దీనిని వాడుకోబోం’అని ఆయన జియో టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 

‘మా అణు విధానం ప్రత్యేకంగా భారత్‌నుద్దేశించిందే అయినప్పటికీ సౌదీ అరేబియా అత్యవసరమైన పక్షంలో మా అణు పాటవం సహా సైనిక సామర్థ్యాలను అన్నింటినీ వాడుకునేందుకు ఈ సమగ్ర ఒప్పందంలో ఏర్పాట్లున్నాయి’అని ఆయన వివరించారు. రెండు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దురాక్రమణ జరిగినా దానిని ఉమ్మడి దురాక్రమణగా పరిగణించేందుకు ఈ ఒప్పందంలో నిబంధనలున్నాయన్నారు. ఇలా ఉండగా, పాక్‌ ఆర్మీతో మరో దఫా తలపడాల్సి వస్తే భారత్‌ ఇప్పుడు సౌదీ అరేబియాను సైతం ఎదుర్కోవాల్సి ఉంటుందని భౌగోళిక రాజకీయ విశ్లేషకుడు ఇయాన్‌ బ్రెమ్మర్‌ చెబుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement