breaking news
India attacks
-
పారిపోండ్రోయ్..!!
ఇస్లామాబాద్: శత్రువు ఎదురొస్తే అతని ప్రాణం తీయడమో లేదంటే తన ప్రాణాలు పోయేదాకా పోరాడటమే వీరుని లక్షణం. పాకిస్తాన్ సైన్యాధికారికి ఇవేం లేనట్లు తాజాగా ఉదంతంతో స్పష్టమైంది. ఆపరేషన్ సిందూర్ వేళ సైనిక చర్యలో భాగంగా పాకిస్తాన్ సైనిక స్థావరంపై భారత్ దాడులు చేస్తుంటే దీటుగా స్పందించాల్సింది పోయి పారిపోయిన పాక్ బ్రిగేడ్ కమాండర్ పలాయనపర్వం తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత క్షిపణులు పాక్ సైనికుల వెన్నులో వణుకు పుట్టించిందన్న వార్త వాస్తవమని తాజా ఘటనతో నిరూపితమైంది. నాయకుడై ముందుండి నడిపించాల్సిందిపోయి తన కింద పనిచేసే జవాన్లకు పిరికిమందు నూరిపోసిన బ్రిగేడ్ కమాండర్ వివరాలు అక్కడి ఒక జూనియర్ ఆఫీసర్ చేసిన ‘రేడియో సిగ్నళ్ల’డీకోడ్ ద్వారా వెల్లడయ్యాయి. అంతా సర్దుకున్నాక తాపీగా వస్తా జూనియర్ అధికారి ఇతర అధికారులకు ‘రేడియో సిగ్నళ్ల ద్వారా పంపిన సందేశాలను భారత సైన్యం విజయవంతంగా డీకోడ్ చేయగా అందులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పాక్ ఆక్రమిత కశీ్మర్లోని ముజఫరాబాద్ వద్ద పాక్ ఆర్మీలోని 75వ ఇన్ఫ్యాంట్రీ బ్రిగేడ్ స్థావరం ఉంది. దానికి ఒక కమాండర్ నేతృత్వం వహిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్‌పై భారత్ సైనిక చర్య మొదలెట్టింది. ఈ 75వ బ్రిగేడ్ స్థావరం మీదా భారత్ దాడులు జరిపింది. వెంటనే భయంతో వణికిపోయిన కమాండర్ అక్కడి నుంచి ఉడాయించాడు. పత్తాలేకుండా పోయిన కమాండర్ గురించి అక్కడి జూనియర్ అధికారి ఆరాతీశాడు. కమాండర్ యుద్ధక్షేత్రంలో మాయమై మసీదులో తేలాడు. అక్కడ నమాజ్ చేసుకుంటూ తలదాచుకుంటున్నట్లు తెల్సింది. వెంటనే ఆర్మీబేస్కు రావాలని జూనియర్ అధికారి కోరగా.. ‘‘నేనిప్పుడు రాను. భారత దాడి ఆగిపోయాక, పరిస్థితి అంతా సద్దుమణిగాక వస్తా. మీరు కూడా అక్కడ ఉండకండి. ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోండి. ఉద్రిక్తతలు తగ్గాక ఆర్మీ బేస్ కార్యాలయాన్ని తాపీగా తెరుద్దాం’’అని కరాఖండిగా చెప్పేశాడు. ఇది విన్న జూనియర్ ఆఫీసర్ హుతాశుడై సంబంధిత సమాచారాన్ని ఇతర అధికారులకు చేరవేశాడు. ఇతర అధికారులతో చెబుతున్న రేడియో చాటింగ్ వివరాలను భారత సైన్యం డీకోడ్ చేసింది. -
‘నూర్ఖాన్’ నేలమట్టం
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌పై భారత్ చేస్తున్న మెరుపుదాడుల్లో ఆ దేశ వైమానిక స్థావరాలు నేలమట్టమవుతున్నాయి. తాజాగా ఇస్లామాబాద్, రావల్పిండి జంట నగరాల సమీపంలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం మీదా భారత్ దాడులు చేసిన విషయం తాజాగా చైనా ఉపగ్రహ చిత్రాలతో స్పష్టమైంది. చైనాకు చెందిన కృత్రిమ ఉపగ్రహాల సంస్థ ‘మిజాజ్విజన్’ తీసిన తాజా శాటిలైట్ ఫొటోలు భారత దాడి తీరును బహిర్గతం చేశాయి. ఇప్పటికే రఫీఖీ, మురీద్, నూర్ ఖాన్, ఛునియన్, సుక్కూర్‌లలో వైమానిక స్థావరాలపై దాడి చేసినట్లు భారత్ ప్రకటించింది. ఈ దాడులను పాకిస్తాన్ సైతం ధృవీకరించింది. రావల్పిండిలోని నూర్‌ఖాన్‌తోపాటు ఛక్వాల్‌లోని మురీద్ స్థావరం, పంజాబ్ ప్రావిన్స్‌లోని ఝంగ్ జిల్లాలోని రఫీఖీ బేస్‌పైనా బాంబులు పడ్డాయని పాకిస్తాన్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మెద్ షరీఫ్ వెల్లడించారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు అత్యంత సమీపంలోని నూర్ఖాన్ బేస్ ఆ దేశానికి చాలా కీలకమైన వైమానిక స్థావరం. ఇక్కడ చాలా ప్రధానమైన స్క్వాడ్రాన్లు ఉంటాయి. సైనిక, సరకు రవాణా సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. సీ–130 హెర్క్యులస్, సాబ్ –2000 సైనిక ఉపకరణాల రవాణా విమానాలను ఇక్కడే నిలిపి ఉంచుతారు. గాల్లోనే విమానాలకు ఇంధనాన్ని నింపే ఐఎల్–78 వంటి రీఫ్యూయిలర్ విమానాలతోపాటు పాక్‌లోని వీవీఐపీలకు సంబంధించిన చిన్న విమానాలకూ ఇదే కీలక స్థావరం. -
ముష్కరులపై తిరుగులేని అస్త్రాలు
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్ ముష్కరుల భరతం పట్టడానికి భారత సైన్యం అత్యాధునిక క్షిపణులు ప్రయోగించింది. స్కాల్ప్ క్రూయిజ్ మిస్సైళ్లు, హ్యామర్ క్షిపణులను రంగంలోకి దించింది. వీటిని రఫేల్ యుద్ధ విమానాల నుంచి ఉగ్రవాద శిబిరాలపై ప్రయోగించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కచ్చితత్వంతో లక్ష్యాలపై దాడులు చేయడంలో స్కాల్ప్ క్షిపణులు పేరుగాంచాయి. వీటిని స్టార్మ్ షాడో అని కూడా అంటారు. పగటిపూట, రాత్రిపూట మాత్రమే కాకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయోగించేలా ఉండడం వీటి ప్రత్యేకత. సుదూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు. స్కాల్ప్ మిస్సైల్స్ రేంజ్ 450 కిలోమీటర్లు. జీపీఎస్ వ్యవస్థ అమర్చి ఉంటుంది. అడ్వాన్స్డ్ నావిగేషన్ సిస్టమ్ వల్ల గురి తప్పదు. యూరోపియన్ కన్సార్టియం ఎంబీడీఏ ఈ క్షిపణులను తయారు చేసింది. దృఢమైన బంకర్లు, ఆయుధాగారాలను ధ్వంసం చేయడానికి ఇవి చక్కగా తోడ్పడతాయి. గత ఏడాది ఉక్రెయిన్ సైన్యం ఇలాంటి క్షిపణులనే తొలిసారిగా రష్యాపై ప్రయోగించింది. స్కాల్ప్ మిస్సైల్ 450 కిలోల వార్హెడ్లను మోసుకెళ్లగలదు. తక్కువ ఎత్తులో ప్రయోగించగల వీలుంది కాబట్టి శత్రువుల నిఘా వ్యవస్థలు వీటిని గుర్తించడం కష్టం. -
ప్రతిదాడులకు ఆస్కారం లేకుండా దాడి చేశాం
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు మరింతగా పెచ్చరిల్లకుండా చూసుకుంటూనే సరైన రీతిలో ప్రతీకార చర్యలు చేపట్టామని ప్రపంచ దేశాలకు భారత్ స్పష్టంచేసింది. ఈ మేరకు బుధవారం భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లతో కలిసి ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో దాడి వివరాలను మీడియాకు వెల్లడించారు. తొలుత విక్రమ్ మిస్రీ మాట్లాడారు. ‘‘ ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి సూత్రధారులు, పాత్రధారులను చట్టం ముందుకు ఈడ్చుకురావాల్సిన అత్యావశ్యక పరిస్థితుల్లో ఈ దాడులు చేయాల్సి వచ్చింది. తమ భూభాగంలో ఉగ్ర వ్యవస్థపై పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోని కారణంగా మేం ‘బాధ్యతాయుతమైన’ దాడులు చేశాం. పహల్గాం ఉదంతం తర్వాత సైతం మరోసారి భారత్‌లో దాడులతో తెగించేందుకు ఉగ్రసంస్థలు కుట్రలు పన్నినట్లు విశ్వసనీయ నిఘా సమాచారం అందటంతో ముందస్తుగా మెరుపుదాడులు చేశాం. పౌర, జనావాసాలకు ఏమాత్రం హాని కలగకుండా కేవలం ఉగ్రవాదుల మౌలికవసతులే లక్ష్యంగా దాడులు జరిపాం. సీమాంతర దాడులు, సీమాంతర చొరబాట్లను నిరోధించడమే లక్ష్యంగా మంగళవారం అర్ధరాత్రి దాడులు కొనసాగాయి. బైసారన్‌లో హేయమైన ఉగ్రదాడి జరిగింది. అమాయకులను తమ కుటుంబసభ్యుల కళ్లెదుటే తలపై గురిపెట్టి కాల్చిచంపారు. దీంతో కుటుంసభ్యుల్లో అంతులేని విషాదం, భయం అలుముకున్నాయి. భారత్ అదే స్థాయిలో ఉగ్రవాదులకు దీటైన సమాధానం చెప్పదల్చుకుంది’’ అని మిస్రీ స్పష్టంచేశారు. ‘‘జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనడం ఇష్టంలేకే ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. కోట్ల మంది పర్యాటకులతో వృద్ధిబాటలో పయనిస్తున్న కశ్మీర్ ఆర్థికవ్యవస్థను ఉగ్రవాదులు కూలదోయాలనున్నారు. ప్రత్యేకంగా హిందువులను చంపేసి కశ్మీర్ లోయలో, దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూశారు. కానీ భారతీయులు వీళ్ల నమ్మకాన్ని వమ్ముచేశారు. ఈ విషయంలో మన ప్రజలను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే’’ అని మిస్రీ అన్నారు. నారీశక్తి.. నాయకత్వం ‘ఆపరేషన్ సిందూర్’ దాడి వివరాలను ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఇద్దరు మహిళా అధికారులు మీడియాకు వివరించడం అక్కడి వారందర్నీ ఆశ్చర్యపరిచింది. భారత్ ఏఏ ప్రాంతాలపై దాడి చేసిందనే పూర్తి వివరాలను భారత ఆర్మీ తరఫున కల్నల్ సోఫియా ఖురేషి, భారత వాయుసేన తరఫున వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు మీడియాకు వెల్లడించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే), పాకిస్తాన్‌లోని ఏఏ ప్రాంతాల్లో ఏ విధంగా భారత్ దాడులు చేసిందో ఈ అధికారిణులు ఇద్దరూ సవివరంగా చెప్పారు. ధైర్యసాహసాలతో దాడులు చేసిన వైనాన్ని వనితలతో చెప్పించడం వెనుక భారత సర్కార్ దౌత్య పాటవం దాగి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. లింగవివక్షకు తావులేకుండా కీలక సమయాల్లోనూ భారత్ సమానత్వానికి, మహిళా సాధికారతకు జై కొడుతుందని ఈ మీడియా సమావేశంలో భారత్ మరోసారి చాటిచెప్పిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. సోఫియా ఖురేషి ప్రస్తుతం ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్‌లో కల్నల్‌గా ఉన్నారు. వింగ్ కమాండర్ వ్యోమికా ప్రస్తుతం హెలికాప్టర్ పైలట్‌గా సేవలందిస్తున్నారు. ఖురేషీ హిందీలో, వ్యోమికా ఇంగ్లిష్ లో మాట్లాడారు. ‘‘ పహల్గాం దాడికి ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టాం. 9 ఉగ్రస్థావరాలపై దాడులు జరిపాం. గత మూడు దశాబ్దాల్లో పాకిస్తాన్లో ఎన్నో ఉగ్ర స్థావరాలు నెలకొల్పారు. ఇక్కడ రిక్రూట్మెంట్, భారత్‌పై విద్వేషాన్ని నూరిపోసేలా ప్రసంగాలు ఇవ్వడం, శిక్షణ కేంద్రాలున్నాయి’’ అని సోఫియా ఖురేషీ చెప్పారు. ‘‘ ఈ దాడుల్లో పాకిస్తాన్ ఆర్మీ సంబంధ ప్రాంతాల జోలికి వెళ్లలేదు. అత్యంత కచ్చితత్వంతో ఉగ్రవాదుల స్థావరాలపైనే దాడులు చేశాం. దాడి ప్రాంత పరిధికి తగ్గట్లుగా సరైన ఆయుధాలను, అనువైన సాంకేతకతను వినియోగించాం. దీని వల్ల లక్ష్యాలను మాత్రమే ధ్వంసంచేశాం. చుట్టుపక్కల ప్రాంతాలకు ఎలాంటి నష్టం జరగలేదు. ముందుగా నిర్ణయించుకున్న భవనాలను మాత్రమే నేలమట్టంచేశాం. ఆ శిబిరాల్లోని ఉగ్రవాదులను హతమార్చాం. లక్ష్యాల ఛేదనలో భారత సాయుధ బలగాల ప్రణాళికా రచన, దాడి, సామర్థ్యాలను ఈ దాడులు మరోసారి చాటిచెప్పాయి. ఇకమీదట పాకిస్తాన్ ఉద్రిక్తతలను పెంచుతూ దాడులు చేయాలని చూస్తే భారత్ కనీవినీ ఎరుగని రీతిలో దాడులతో విరుచుకుపడుతుందని మరోసారి స్పష్టంచేస్తున్నా. జై హింద్’’ అని వ్యోమికా సింగ్ తన మీడియా బ్రీఫింగ్ను ముగించారు. ఈ ఇద్దరు మహిళాధికారుల మధ్యలో కూర్చొని మీడియాకు వివరాలు వెల్లడించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఒక కశ్మీరీ పండిట్. కీలక ప్రెస్మీట్లో ఎవరెవరు వేదికపై ఆసీనులై భారతవాణిని ప్రపంచానికి వినిపించాలనే విషయంలో కేంద్రప్రభుత్వానికి అత్యంత స్పష్టత ఉందని ఈ ముగ్గురిని చూస్తే తెలుస్తోంది. -
Operation Sindoor: ఉగ్ర తండాలపై 'రక్త సిందూరం'
అమాయక మహిళల నుదుటి నుంచి ముష్కరులు తుడిచేసిన సిందూరం వారి పాలిట రక్తసిందూరమే అయింది. దెబ్బతిన్న పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో పాక్‌కు, దాని ప్రేరేపిత ఉగ్ర ముఠాలకు తెలిసొచ్చింది. పహల్గాం ఉగ్ర దాడికి భారత్ అంతకంతా బదులు తీర్చుకుంది. పాక్, పీఓకేల్లోని 9 ప్రాంతాలపై సైన్యం విరుచుకుపడింది. లష్కరే, జైషే వంటి ఉగ్ర సంస్థల ప్రధాన స్థావరాలతో పాటు శిక్షణ శిబిరాలను సమూలంగా తుడిచిపెట్టింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టి ‘ఆపరేషన్ సిందూర్’ను దిగి్వజయంగా పూర్తి చేసింది. ‘జైహింద్’ అంటూ పహల్గాం మృతులకు ఘనంగా నివాళులు అర్పించింది.న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడికి పక్షం రోజుల్లోనే భారత్ బదులు తీర్చుకుంది. అమాయక పర్యాటకులను పాశవికంగా పొట్టన పెట్టుకున్న ఉగ్ర ముష్కరులకు జన్మలో మర్చిపోలేని గుణపాఠం నేరి్పంది. వారిని ప్రపంచం అంచుల దాకా వేటాడైనా కలలో కూడా ఊహించనంత కఠినంగా శిక్షిస్తామన్న ప్రధాని ప్రతిజ్ఞను సైన్యం దిగి్వజయంగా నెరవేర్చింది. ప్రతీకార దాడుల విషయంలో పూర్తి స్వేచ్ఛనిస్తూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటాక మెరుపు దాడులు చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదులు మౌలానా మసూద్ అజర్ సారథ్యంలోని జైషే మహ్మద్, హఫీజ్ సయీద్ నేతృత్వంలోని లష్కరే తొయిబాతో పాటు హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఉగ్ర తండాల వెన్ను విరిచింది. వాటి ప్రధాన స్థావరాలతో పాటు శిక్షణ శిబిరాలను కూడా నేలమట్టం చేసేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట 25 నిమిషాల దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. త్రివిధ దళాలు పూర్తి సమన్వయంతో, అత్యంత కచ్చితత్వంతో ఆపరేషన్ నిర్వహించాయి. ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్‌తో వైమానిక దళం, సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులతో ఆర్మీ ద్విముఖ వ్యూహంతో ఏక కాలంలో దాడులకు దిగాయి. అత్యాధునిక స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు, హామర్ ప్రెసిషన్ బాంబులు, గైడెడ్ బాంబ్ కిట్లు, ఆత్మాహుతి డ్రోన్లతో 9 ఉగ్రవాద శిబిరాలను నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేశాయి. వీటిలో ఐదు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉండగా నాలుగు స్వయానా పాక్ గడ్డ మీదే ఉండటం విశేషం! బాలాకోట్ దాడుల మాదిరిగా పాక్ గగనతలంలోకి వెళ్లకుండా మన ఎయిర్‌ఫోర్స్ అమ్ములపొదిలోని అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు సరిహద్దులకు ఇవతలి నుంచే అరగంట లోపే పని ముగించేశాయి. అర్దరాత్రి 1:05కు మొదలైన దాడులు 1:30కు ముగిశాయి. ఆ వెంటనే 1:44 గంటలకు రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ‘‘కాసేపటి క్రితం ఆపరేషన్ సిందూర్ చేపట్టాం. పాక్, పీఓకేల్లో నుంచి భారత్‌పై ఉగ్ర దాడులకు వ్యూహరచన చేసిన ఉగ్రవాద మౌలిక వ్యవస్థలపై దాడులు చేశాం. ఉద్రిక్తతలకు తావులేని రీతిలో, పూర్తి కచ్చితత్వంతో కేవలం ఉగ్ర శిబిరాలను మాత్రమే ధ్వంసం చేశాం. పాక్ సైన్యాన్ని, సైనిక వ్యవస్థలను, పౌరులను ఏ మాత్రమూ లక్ష్యం చేసుకోలేదు. లక్ష్యాల ఎంపిక, దాడిలో ఆ మేరకు పూర్తి సంయమనం పాటించాం’’ అని వెల్లడించింది. ‘‘ఈ రోజు మనం చరిత్ర సృష్టించాం. భారత్ మాతా కీ జై’’ అంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘పహల్గాం బాధితులకు న్యాయం జరిగింది. జైహింద్’’ అని సైన్యం పేర్కొంది. దాడుల వీడియోను ఎక్స్‌లో ఉంచింది. మృతుల్లో జైషే చీఫ్ అజర్ కుటుంబానికి చెందిన 10 మంది ఉన్నారు. దీన్ని అజర్ కూడా ధ్రువీకరించాడు. జైషే ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడుల్లో వారితో పాటు తన నలుగురు సన్నిహిత సహచరులు కూడా మరణించినట్టు చెప్పుకొచ్చాడు. పాక్ ప్రేరేపిత ఉగ్ర తండాల పీచమణచేలా అద్భుతంగా సాగిన సైనిక చర్య భారతీయులందరికీ గర్వకారణమంటూ ప్రధాని మోదీ ప్రస్తుతించారు. భారత దాడుల్లో 26 మందే మరణించారని, 46 మందికి పైగా గాయపడ్డారని పాక్ చెప్పుకుంది. సరైన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామంటూ తొలుత ప్రగల్భాలకు దిగినా కాసేపటికే దిగొచ్చింది. గట్టి ప్రతి చర్యలు తప్పవంటూ బీరాలు పలికిన రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ‘ఇప్పటికైనా ఉద్రిక్తతలు పెరగకుండా భారత్ చూస్తే మేమూ సహకరిస్తాం’ అంటూ సాయంత్రానికల్లా మాట మార్చారు. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో బైసారన్ మైదానంలో 26 మంది పర్యాటకులను లష్కరే ఉగ్రవాదులు కిరాతకంగా కాల్చి చంపడం తెలిసిందే.అద్భుత నైపుణ్యం దాడులపై నిపుణులు సైన్యం ఆపరేషన్ సిందూర్‌ను అమలు చేసిన తీరును రక్షణ నిపుణులు ఎంతగానో కొనియాడుతున్నారు. ఉగ్ర శిబిరాల పరిసరాల్లోని నివాసాలు తదితరాలకు ఏమాత్రమూ నష్టం జరగకుండా, కేవలం లక్ష్యాలను మాత్రమే నేలమట్టం చేస్తూ అత్యంత కచ్చితత్వంతో దాడులు జరపడం అద్భుతమని చెబుతున్నారు. ‘‘పాక్ సైనిక స్థావరాలు, కీలక మౌలిక వ్యవస్థల వంటివాటి జోలికే వెళ్లకుండా సంయమనం పాటించడం నిస్సందేహంగా అద్భుతమైన దౌత్య ఎత్తుగడే. తద్వారా ప్రతీకార దాడులకు దిగేందుకు పాక్‌కు ఎలాంటి సాకూ లేకుండా పోయింది. పైగా 9 ఉగ్ర శిబిరాల్లో 4 స్వయానా పాక్ భూభాగంలోనే ఉండటంతో ఆ తండాలను దాయాది ఇప్పటికీ పెంచి పోషిస్తోందని నిర్ద్వంద్వంగా నిరూపణ అయింది. దాంతో పాక్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. అంతర్జాతీయ సమాజం ముందు మరోసారి ధూర్త దేశంగా మిగిలింది’’ అని వారు వివరించారు. దాడులు చేసిన ప్రాంతాల్లో కొన్ని సరిహద్దుల నుంచి ఏకంగా 100 కి.మీ. లోపల ఉండటం విశేషం. తద్వారా పాక్‌లో ఏ లక్ష్యాన్నైనా, ఎప్పుడైనా అత్యంత కచ్చితత్వంతో ఛేదించే సత్తా తనకుందని భారత్‌కు మరోసారి నిరూపించింది. 25 నిమిషాలు.. 9 లక్ష్యాలుదాడుల విషయంలో సైన్యం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పక్కాగా వ్యవహరించి అత్యంత విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది. నిఘా వర్గాలు పక్షం రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించి లష్కరే, జైషే తదితర ఉగ్రవాద సంస్థ శిబిరాలతో పాటు ప్రధాన కార్యాలయాల ఆనుపానులను పక్కాగా సేకరించాయి. వాటి ఆధారంగా ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగాయి. సరిహద్దులకు ఆవల క్షిపణి నిరోధక వ్యవస్థలు తదితరాలతో కాచుకుని కూచున్న శత్రు సైన్యం అంచనాలకు అందకుండా వ్యవహరించాయి. సరిహద్దులు దాటకుండానే ఆపరేషన్ నిర్వహించాయి. మురిద్కే, బహావల్‌పూర్‌ల్లోని లష్కరే, జైషే ప్రధాన స్థావరాల్లో ఒక్కోచోట కనీసం 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. -
పుల్వామా దాడి; పాక్ సంచలన ప్రకటన
ఇస్లామాబాద్: పుల్వామా దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనీ, ఆ ఘటన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విజయమని ఆ దేశ మంత్రి ఒకరు ప్రకటించడం సంచలనం రేపింది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో గురువారం జరిగిన చర్చ సందర్భంగా శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఫవద్ చౌధరి ఈ మేరకు ప్రకటన చేశారు. ‘‘భారత్‌ను వారి దేశంలోనే గట్టి దెబ్బ తీశాం. పుల్వామా విజయం ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో మన జాతి సాధించిన విజయం. ఈ విజయంలో మీరు, మేము, మనందరమూ భాగస్వాములమే’’అని అన్నారు. పుల్వామాలో విజయం అని మంత్రి పేర్కొనడంపై సభలో కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఫావద్ మీడియాతో మాట్లాడుతూ.. పుల్వామా ఘటన అనంతరం పాక్ బలగాలు దాడి చేసేందుకు భారత్ భూభాగంలోకి వెళ్లగలిగాయని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పుల్వామాలో విజయం అన్న వ్యాఖ్యలను మాత్రం వెనక్కు తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. అభినందన్‌ని విడుదల చేయకపోతే భారత్ దాడి చేస్తుందని ఆర్మీ చీఫ్‌కే కాళ్లలో వణుకు పుట్టినట్టుగా పీఎంఎల్–ఎన్ నేత అయాజ్ సాధిక్ ప్రకటన చేసిన నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన చౌధరి ఈ వ్యాఖ్యలు చేశారు. సాధిక్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన పేర్కొన్నారు. ‘ప్రభుత్వాన్ని వ్యతిరేకించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ, జాతిని కించపరచడం తగదు’ అని తెలిపారు. గత ఏడాది జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత్ జవాన్లు నేలకొరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం రెండు దేశాల మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. కాళ్లు వణికాయి.. చెమటలు పట్టాయి మేజర్ అభినందన్ వర్ధమాన్.. ఈ పేరు వింటేనే చాలు భారతీయుల గుండెలు ఉప్పొంగుతాయి. గత ఏడాది ఫిబ్రవరిలో కశ్మీర్‌లోని పుల్వామా దాడి ఘటన అనంతరం పాక్ చెరలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ప్రదర్శించిన శౌర్య పరాక్రమాలకు సాక్షాత్తూ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా వెన్నులో వణుకు పుట్టింది. ‘‘బాజ్వా కాళ్లు వణికాయి, నుదుటంతా చెమటలు పట్టాయి, పాక్ చెరలో ఉన్న అభినందన్‌ను విడుదల చేయకపోతే భారత్ ఎక్కడ దాడికి దిగుతుందోనని ఆయన నిలువెల్లా వణికిపోయారు’’అని పాకిస్తాన్ ఎంపీ, పాక్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) నాయకుడు సర్దార్ అయాజ్ సాధిక్ బుధవారం పార్లమెంటులో వెల్లడించారు. పుల్వామా దాడి ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై ఫిబ్రవరి 26, 2019న భారత్ బాంబులతో దాడి చేసింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య జరిగిన వైమానిక పోరులో పాక్ యుద్ధవిమానం ఎఫ్–16ని అభినందన్ మిగ్–21 విమానంతో వెంబడించారు. పాక్ విమానాన్ని కూల్చేశారు. అదే సమయంలో మిగ్ విమానం పాక్ భూభాగంలో కూలిపోవడంతో అభినందన్‌ను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. ఆనాటి సమావేశంలో ఏం జరిగిందంటే..! మేజర్ అభినందన్ వర్ధమాన్‌ను పాక్ చెరలోకి తీసుకున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ సమయంలో పాక్‌లో పార్లమెంటరీ పార్టీ నాయకులతో కూడిన ఉన్నతస్థాయి సమావేశంలో జరిగిన విషయాలను సాధిక్ వెల్లడించారు. ‘‘ఆనాటి సమావేశానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ హాజరు కాలేదు. విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి సమావేశంలో ఉన్నారు. అప్పుడే గదిలోకి వచ్చిన ఆర్మీ చీఫ్ బాజ్వా కాళ్లు వణుకుతున్నాయి. శరీరమంతా చెమటలతో నిండిపోయింది. చర్చలు జరిగిన అనంతరం ఖురేషి అభినందన్‌ను వెంటనే విడుదల చేయనివ్వండి. లేకపోతే భారత్ రాత్రి 9 గంటలకి మన దేశంపై దాడికి దిగుతుందని ఖురేషి అన్నారు’’ అంటూ సాధిక్ ఆనాటి సమావేశ వివరాలను గుర్తు చేసుకున్నారు. భారత్ దాడి చేయడానికి సన్నాహాలు చేయకపోయినా, పాక్ సర్కార్ భారత్ ముందు మోకరిల్లి అభినందన్‌ని అప్పగించిందంటూ సాధిక్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై మాటల తూటాలు విసిరారు. తన మాటల్ని వక్రీకరించారంటూ ఆ తర్వాత సాధిక్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. -
పాక్ ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు
-
కుప్పకూలిన షేర్లు
-
కుప్పకూలిన షేర్లు
• భారత్-పాక్ సరిహద్దు ఉద్రిక్తతల ప్రభావం • సెన్సెక్స్ 465 పాయింట్లు పతనం • నిఫ్టీ 154 పాయింట్లు డౌన్ ముంబై: పాకిస్తాన్లో ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ దాడులు జరిపిందన్న వార్తలతో గురువారం స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. బీఎస్ఈ సెన్సెక్స్ 465 పాయింట్లు (1.64 శాతం) పతనమయ్యింది. గత మూడు నెలల్లో ఇదే పెద్ద క్షీణత. అంతర్జాతీయ ట్రెండ్ అనుకూలంగా వుండటంతో ట్రేడింగ్ ప్రారంభంలో 180 పాయింట్లకుపైగా సెన్సెక్స్ పెరిగినప్పటికీ, మధ్యాహ్న సమయంలో పాక్ సరిహద్దుల్లో దాడుల అంశాన్ని భారత్ వెల్లడించడంతో క్షణంలో షేర్లు నిలువునా పడిపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 573 పాయింట్లవరకూ క్షీణించింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 465 పాయింట్ల తగ్గుదలతో 27,828 పాయింట్ల వద్ద ముగిసింది. ఆగస్టు 26 తర్వాత ఇదే కనిష్ట ముగింపు. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా ఇదే బాటలో 154 పాయింట్లు పతనమై (1.76 శాతం) 8,591 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. గరిష్టస్థాయి నుంచి 755 పాయింట్లు డౌన్... ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 28,475 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరి గింది. ఆ స్థాయి నుంచి ఆర్మీ అధికారుల ప్రకటన వెలువడగానే 27,720 పాయింట్ల కనిష్టస్థాయి వరకూ కుప్పకూలింది. గరిష్టస్థాయి నుంచి 755 పాయింట్ల పతనాన్ని (2.65 శాతం) బీఎస్ఈ ప్రధాన సూచీ చవిచూసింది. అలాగే నిఫ్టీ 8,800 పాయింట్ల నుంచి 8,558 పాయింట్ల వరకూ 242 పాయింట్లు (2.75 శాతం) ఇంట్రాడేలో పడిపోయింది. సెన్సెక్స్ షేర్లలో ఒకటి తప్ప... సెన్సెక్స్-30లో ఒక్క షేరు తప్ప మిగిలిన 29 షేర్లూ నష్టాల్ని చవిచూసాయి. అన్నింటికంటే అధికంగా అదాని పోర్ట్స్ 5.01 శాతం తగ్గగా, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, గెయిల్, టాటా స్టీల్, లుపిన్, టాటా మోటార్స్, ఎస్బీఐలు 2-5 శాతం మధ్య తగ్గాయి. ఐటీ దిగ్గజం టీసీఎస్ మాత్రం 0.46 శాతం పెరుగుదలతో ముగిసింది. దాడుల ప్రకటన వెలువడగానే ఒక్కసారిగా మార్కెట్లో భయాందోళనలు వ్యాపించాయని, దాంతో అమ్మకాలు వెల్లువెత్తాయని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. రియల్టీ షేర్లు మిగతా రంగాలతో పోలిస్తే బాగా పడిపోయాయని ఆయన తెలిపారు. ఈ సూచి 6.31% తగ్గగా, డీఎల్ఎఫ్, హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్ రియల్టీ షేర్లు 8-9% మధ్య పతనమయ్యాయి. పవర్ సూచి 4.11 శాతం, హెల్త్‌కేర్ సూచి 3.26 శాతం, మెటల్ సూచి 3.17 శాతం, ఇన్ఫ్రా సూచి 3.15 శాతం చొప్పున తగ్గాయి. డెరివేటివ్స్ ముగింపుతో కొంత ఊరట.. సెప్టెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులకు ముగింపునకు గురువారమే చివరిరోజుకావడంతో మార్కెట్ మరిం త పతనంకాకుండా నిలిచిందని విశ్లేషకులు చెప్పారు. ఒకే రోజున భారీ లాభాలు సంపాదించిన బేర్స్ వారి షార్ట్ పొజిషన్లను అక్టోబర్‌కు రోలోవర్ చేసేబదులు స్క్వేర్‌ఆఫ్ చేసుకోవడంతో చివరి అరగంటలో పలు లార్జ్‌క్యాప్ షేర్లు కనిష్టస్థాయి నుంచి కోలుకున్నాయని, దాంతో సూచీల పతనం ఆగిందని విశ్లేషకులు వివరించారు. లాంగ్ పొజిషన్ల ఆఫ్‌లోడింగ్ భారీస్థాయిలో వున్నా, షార్ట్ కవరింగ్ చాలావరకూ షేర్ల భారీ పతనాన్ని నిలువరించిందని వారన్నారు. ఇన్వెస్టర్ల సంపదలో 2.45 లక్షల కోట్లు మైనస్ గురువారం నాటి మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులోనే రూ. 2.45 లక్షల కోట్లు హరించుకుపోయింది. బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ రూ. 2,45,360 కోట్ల మేర తగ్గి, రూ. 1,09,58,658 కోట్లకు దిగింది. ప్రభావం కొద్ది కాలమే.. సరిహద్దు ఉద్రిక్తతల ప్రభావం మార్కెట్లపై దీర్ఘకాలం వుంటుందని భావించడం లేదు. 1998లో పోఖ్రాన్లో భారత్ అణు పరీక్షలు, 1999లో కార్గిల్ యుద్ధం జరిగిన సందర్భాల్లో ఇరుదేశాల మధ్యా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇటువంటి సంఘటనల్ని మార్కెట్ కొద్దికాలంపాటు ప్రతికూలంగా పరిగణిస్తుంది. కానీ మధ్య, దీర్ఘకాలాల్లో ప్రభావమేదీ వుండదు. - తీర్థంకర్ పట్నాయక్, ఇండియా స్ట్రాటజిస్ట్, మిజుహో బ్యాంక్ ఇంకొన్ని రోజులు మార్కెట్‌పై ఒత్తిడి.. మరికొన్ని రోజులు మార్కెట్ అమ్మకాల ఒత్తిడికి లోనవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. భారత్- పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం మార్కెట్‌పై వుంటుంది. స్వల్పకాలంలో ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణిలో వుంటే మంచిది. - దినేశ్ టక్కర్, సీఎండీ, యాంజిల్ బ్రోకింగ్ దీర్ఘకాలిక పెట్టుబడులకు సమస్య లేదు ఉగ్రవాద శిబిరాలపై జరిగిన దాడులు... పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందన్న భయాలే తాజా పతనానికి కారణం. యుద్ధం జరుగుతుందని నేను భావించడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి దీర్ఘకాలిక చోదకాలు పెట్టుబడులు అనుకూలంగా వున్నాయి. -దీపేన్ సేథ్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్