కుప్పకూలిన షేర్లు | Sensex, rupee crash after surgical strikes on terror camps; Karachi bourse ends a sober 0.2% down | Sakshi
Sakshi News home page

Sep 30 2016 7:43 AM | Updated on Mar 21 2024 9:51 AM

పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ దాడులు జరిపిందన్న వార్తలతో గురువారం స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 465 పాయింట్లు (1.64 శాతం)పతనమయ్యింది. గత మూడు నెలల్లో ఇదే పెద్ద క్షీణత. అంతర్జాతీయ ట్రెండ్ అనుకూలంగా వుండటంతో ట్రేడింగ్ ప్రారంభంలో 180 పాయింట్లకుపైగా సెన్సెక్స్ పెరిగినప్పటికీ, మధ్యాహ్న సమయంలో పాక్ సరిహద్దుల్లో దాడుల అంశాన్ని భారత్ వెల్లడించడంతో క్షణంలో షేర్లు నిలువునా పడిపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 573 పాయింట్లవరకూ క్షీణించింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 465 పాయింట్ల తగ్గుదలతో 27,828 పాయింట్ల వద్ద ముగిసింది. ఆగస్టు 26 తర్వాత ఇదే కనిష్ట ముగింపు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా ఇదే బాటలో 154 పాయింట్లు పతనమై (1.76 శాతం) 8,591 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement